Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్‌..?

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారు పోలీసులు.. అనంతపురం త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో తోపదుర్తిపై కేసు నమోదైంది. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు.. అరెస్ట్‌ చేసేందుకు రంగంలోకి దిగారు.. పోలీసుల పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడంతో పాటు, పోలీసులను, నాయకులను, ప్రజలను చంపుతానని బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనంతపురం త్రీటౌన్‌ పోలీసులు..

ఇక, ఈ కేసు నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు హీట్‌ పుట్టిస్తుందిగా.. మరోవైపు.. తోపదూర్తి ప్రకాష్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. నాన్‌బెయిలబుల్‌ కేసులకు దారి తీయడం.. అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో.. ఉత్కంఠగా మారింది..