NTV Telugu Site icon

Devara 2: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర 2 వచ్చేది అప్పుడే

New Project (88)

New Project (88)

Devara 2: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​ను బిగ్ స్క్రీన్​పై చూసేందుకు అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్సే కాదు. ఆడియెన్స్, మూవీ లవర్స్ కూడా వెండితెరపై ఎన్టీఆర్ నటనను చూసి ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నారు. కానీ అందుకు మరికొంత టైమ్ పట్టనుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘దేవర’ చిత్రం సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజై దాదాపు రెండున్నర ఏళ్లు కావొస్తోంది. ఈ గ్యాప్​లో ఆయన నుంచి మరే సినిమా కూడా రాలేదు. దీంతో అభిమానులకు ఎన్టీఆర్ బాగా బాకీ పడిపోయారు. అయితే ఈ లోటును భర్తీ చేసేందుకు ఆయన కసిగా కష్టపడుతున్నారు. ఫ్యాన్స్​కు ఫుల్​మీల్స్ పెట్టేందుకు ఈ నందమూరి హీరో రెడీ అవుతున్నారు. 15 నెలల్లో మూడు సినిమాలు ప్రేక్షకుల కోసం తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

Read Also:Duvvada Vani: ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నా.. ఈ పరిస్థితి ఊహించలేదు..!

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవర అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. వచ్చిన రెండు పాటలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇవి భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుండగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో మొదటి భాగం ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కు తీసుకొస్తున్నారు. అయితే మరి పార్ట్ 2 విడుదల ఎప్పుడు అనేది ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఈ సినిమా సీక్వెల్ ని పెద్దగా లేట్ చేయకుండా 2025 లోనే తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తుంది. దీనితో ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు తారక్ ఎక్కువ సమయం తీసుకునేలా లేరనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం బాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also:Manish Sisodia: 17 నెలల తర్వాత భార్యతో కలిసి చాయ్ తాగిన మనీష్ సిసోడియా

Show comments