NTV Telugu Site icon

LML Star: ఈ స్కూటీకి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. 225 కి.మీ వెళ్లొచ్చు..

Lml Star Electric Scooter

Lml Star Electric Scooter

మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేందుకు చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ఎందుకంటే అదిరే ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు దొరుకుతున్నాయి. వీటిల్లో కొన్ని హైరేంజ్ కలిగి ఉన్నాయి. వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక్కసారి చార్జింగ్ పెడితే.. ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.

Read Also : PM Modi: ఎమర్జెన్సీ చీకటి రోజులు.. మరిచిపోలేని కాలం అంటూ ప్రధాని ట్వీట్..

ప్రస్తుతం మార్కెట్ లోకి ఎల్ఎంఎల్ స్టార్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. దీని రేంజ్ కూడా చాలా ఎక్కువ.. అందువల్ల కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ మోడల్‌ను ఒకసారి లుక్ వేయొచ్చు. ఎందుకంటే ఇందులో దిమ్మతిరిగే ఫీచర్లున్నాయి.

Read Also : Health Tips: వానకాలంలో అల్లంతో అదిరిపోయే ప్రయోజనాలు..

ఈ స్కూటీలో ఇంటరాక్టివ్ స్క్రీన్, ఫోటోసెన్సిటివ్ హెడ్‌ల్యాంప్, అడ్జస్టబుల్ సీటింగ్ వంటి ఫీచర్లు దీనికి సొంతం. ఇందులో ఇంకా 360 డిగ్రీ కెమెరా ఉంటుంది.. మొబైల్ కనెక్టివిటీ ఫెసిలిటీ, స్టార్ట్ బటన్, ఎల్ఈడీ లైట్, యూఎస్‌బీ పోర్ట్, ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, డిజిటల్ స్పీడో మీటర్, డిజిటల్ ఓడో మీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, ఇన్‌బిల్ట్ జీపీఎస్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉండనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో డిస్‌ప్లే స్క్రీన్ ఉంటుంది.

Read Also : Project k : సినిమాలో కమల్ హాసన్ నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన మేకర్స్..

అయితే దీని మీద పేరు డిస్‌ప్లే అవుతుంది. మీకు నచ్చిన పేరును సెట్ చేసుకోవచ్చు. ఫోన్ యాప్‌లో మీకు నచ్చిన పేరు లేదా కోట్స్ రాసుకోవచ్చు. అది మీ స్కూటర్ ముందు వైపున ఉన్న స్క్రీన్‌ పై కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. దీని ధర దాదాపు రూ. 1.4 లక్షల వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ విషయానికి వస్తే.. పలు బ్యాటరీ ఆప్షన్లలో ఈ స్కూటీ అందుబాటులో ఉండొచ్చని తెలుస్తుంది.

Read Also : Amit Shah-KTR: లాస్ట్ మినిట్‌లో కేటీఆర్ తో అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు

అందువల్ల బ్యాటరీ ప్రాతిపదికన రేంజ్ కూడా మారే అవకాశం ఉంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 150 నుంచి 225 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయొచ్చని తెలుస్తుంది. బ్యాటరీ ఆప్షన్ ఆధారంగా రేంజ్ మారుతూ ఉండొచ్చు. ఇందులో 4 కేడబ్ల్యూహెచ్ వరకు కెపాసిటీతో బ్యాటరీ ప్యాక్ ఉండే ఛాన్స్ ఉంది.