NTV Telugu Site icon

Jasprit Bumrah: కొత్త సంప్రదాయానికి ఇది ప్రారంభం: బుమ్రా

Jasprit Bumrah Captain

Jasprit Bumrah Captain

పేసర్లు కెప్టెన్లుగా ఉండాలని తాను ఎప్పుడూ చెబుతుంటానని, మైదానంలో వారి ట్రిక్‌లు భిన్నంగా ఉంటాయని టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా తెలిపాడు. కపిల్‌ దేవ్‌ సహా గతంలో చాలామంది పేసర్లు కెప్టెన్లుగా ఉన్నారని, ఈ కొత్త సంప్రదాయానికి ఇది ప్రారంభం అని తాను ఆశిస్తున్నానన్నారు. కెప్టెన్సీ ఓ గౌరవం అని, తనకు సొంత శైలి ఉందని బుమ్రా చెప్పుకొచ్చాడు. కుమారుడి పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్‌ బుమ్రా.. భారత జట్టును నడిపించనున్నాడు.

ప్రీమ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో జస్ప్రీత్‌ బుమ్రా మాట్లాడుతూ… ‘కెప్టెన్సీ ఓ గౌరవం. నాకు సొంత శైలి ఉంది. ఎంఎస్ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ కెప్టెన్సీలు కూడా విభిన్నంగా ఉంటాయి. బాధ్యతలు తీసుకోవడాన్ని నేను ఇష్టపడతాను. నేను గతంలోనే రోహిత్‌తో చాలాసార్లు మాట్లాడాను కానీ.. ఇక్కడికి వచ్చాక నాయకత్వంపై మరింత స్పష్టత వచ్చింది. పేసర్లు కెప్టెన్లుగా ఉండాలని నేను ఎప్పుడూ అంటుంటా. ఎందుకంటే మైదానంలో వారి ట్రిక్‌లు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు పాట్‌ కమిన్స్‌ అద్భుతంగా రాణించాడు. గతంలో కపిల్‌ దేవ్‌ సహా చాలా మంది సక్సెస్ అయ్యారు. ఈ కొత్త సంప్రదాయానికి ఇది ప్రారంభం అని ఆశిస్తున్నా’ అని అన్నాడు.

Also Read: 8 Sixes Off 8 Balls: క్రికెట్‌లో సంచలనం.. 8 బంతుల్లో 8 సిక్స్‌లు!

‘ఒక సిరీస్‌లో గెలిచినా, ఓడినా.. తర్వాత సిరీస్‌లో మొదటి నుంచి మొదలుపెట్టాల్సిందే. న్యూజిలాండ్‌తో సిరీస్‌ ఓటమి తాలుకా నిరుత్సాహాన్ని ఆస్ట్రేలియాకు తీసుకురాలేదు. ఆ సిరీస్‌ నుంచి మేం చాలా అంశాలు నేర్చుకున్నాం. భారత్‌లో విభిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక్కడ మా ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. తుది జట్టుపై ఓ అంచనాకు వచ్చాం. మ్యాచ్ ప్రారంభానికి ముందు డీటెయిల్స్ వెల్లడిస్తాం’ అని జస్ప్రీత్‌ బుమ్రా చెప్పాడు. ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్‌లను గెలుచుకొన్న భారత్.. హ్యాట్రిక్‌పై కన్నేసింది.