NTV Telugu Site icon

Mohammed Shami Final: సెమీ ఫైనల్ కాదు.. ‘షమీ’ ఫైనల్!

Mohammed Shami Final

Mohammed Shami Final

Fans Tweets Mohammed Shami’s Final: వన్డే ప్రపంచకప్‌ 2023లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్‌గా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో ఏకంగా 23 వికెట్స్ పడగొట్టాడు. లీగ్ దశలో న్యూజీలాండ్, శ్రీలంకలపై ఐదేసి వికెట్స్ పడగొట్టిన షమీ.. ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్స్ తీశాడు. దక్షిణాఫ్రికాపై 2 వికెట్స్ తీసిన అతడు.. నెదర్లాండ్స్‌పై మాత్రం ఒక్క వికెట్ తీయలేదు. ఇక కీలక సెమీస్ మ్యాచ్‌లలో సంచలన బౌలింగ్‌తో జట్టుకు అద్భుత విజయం అందించాడు.

బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో ఏడు వికెట్లు తీసిన మహ్మద్ షమీ.. కలకాలం గుర్తిండిపోయే గొప్ప ప్రదర్శన చేశాడు. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. షమీ పదునైన బంతులకు దాసోహమైంది. ఓ దశలో టీమిండియాను భయపెట్టిన న్యూజిలాండ్‌ బ్యాటర్లను పెవిలియన్ చేర్చుతూ.. కివీస్‌ను చావుదెబ్బ తీశాడు. నిప్పులు చెరిగే బంతులతో న్యూజిలాండ్‌ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కివీస్‌ మ్యాచ్‌లో పట్టుబిగిస్తున్న సమయంలో తన అనుభవాన్ని ఉపయోగించి భారత్ ఊపిరి పీల్చుకునేలా చేసిన షమీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Also Read: Mohammed Shami Records: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఎవరికీ సాధ్యం కాలే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో మహ్మద్ షమీ పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఫాన్స్, మాజీలు షమీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మహ్మద్ షమీ అద్భుతం, మహ్మద్ షమీ సూపర్, మహ్మద్ షమీ తోపు అంటూ ట్వీట్స్ చేస్తారు. చాలా మంది అయితే.. ఇది సెమీ ఫైనల్ కాదు.. ‘షమీ’ ఫైనల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షమీ బౌలింగ్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లను భయపెట్టిన షమీ బౌలింగ్‌ను మీరూ ఒకసారి చూసేయండి.