WTC FINAL మ్యాచ్ లండన్ లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. మ్యాచ్ మొదటిలో శుభారంభం అందించింది. ఆ తర్వాత ఆసీస్ బ్యాట్స్ మెన్లు స్టీ్వెన్ స్మిత్, ట్రేవిస్ హెడ్ సెంచరీలతో భారత బౌలర్ల భరతం పట్టారు. ఇంకేముంది ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది. మనళ్లోకు ప్రాక్టీస్ లేకపోవడమో, లేదంటే ఫైనల్స్ అనగానే భయమేమైనా పుట్టుకుందో తెలియదు.. కానీ పరుగుల సునామీని ఐతే ఆపలేకపోయారు. చేసేదేముంది ఆ ఒత్తిడి అంతా బ్యాటింగ్ పై పడింది.
Read Also: Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో 1033 జాబ్స్..పూర్తి వివరాలు..
ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తొందరగానే ఔటయ్యారు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం కనీసం 50 పరుగులు లేకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఐతే ఇప్పుడు భారత క్రికెటర్స్ పై పలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు అభిమానులు. మొన్నటిదాకా ఐపీఎల్ లో ఫుల్ ఫాంలో ఉన్న గిల్.. ఇప్పుడేమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు ఐపీఎల్ లోనే కాకుండా.. ఈ ఏడాది జరిగిన మ్యాచ్ ల్లో.. మూడు ఫార్మట్లలో బాగానే ఆడాడు. అంతేకాకుండా సెంచరీల మీద సెంచరీల బాదాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ పై వన్డేలలో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఐపీఎల్ అయితే ఏకంగా 3 సెంచరీలు కొట్టి మంచి ఫాంలో ఉన్న గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో తుస్సుమనిపించాడు. దీంతో ఏడాది కాలమంతా సంపాదించుకున్న క్రేజ్ అంతా ఈ ఒక్క చెత్త ఇన్నింగ్స్ తో ఢమాల్ అయిపోయింది.
Read Also: Aadhipurush : ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్ అలా ఉండటానికి కారణం అదేనా..?
డబ్ల్యూటీసీ ఫైనల్ లో శుభ్ మన్ గిల్.. 15 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసాడు. స్కాట్ బొలాండ్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక చూడండి గిల్ ఔటైన తర్వాత టీమిండియా ఫ్యాన్స్ అతడిని ఆటాడుకున్నారు. ఇదేం చెత్త బ్యాటింగ్ రా బాబు.. అసలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అంటే ఎలా తెలుసా..? అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఆడేది అల్లాటప్పా బౌలర్లతో కాదని.. అంతేగాక అక్కడి పిచ్ లు ఇండియాలో లాగా ఉండవని గుర్తు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. గిల్ ఔటయ్యాక పలువురు అభిమానులు ట్విటర్ లో స్పందిస్తూ.. ‘శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. నువ్వు వరల్డ్ బెస్ట్ టీమ్ తో ఆడుతున్నావు. అదేదో బంగ్లాదేశ్ టీమో లేక ఐపీఎల్ ఫ్రాంచైజో కాదు. నీకంటే శిఖర్ ధావన్ వందపాళ్లు నయం..’, ‘టెస్టు క్రికెట్ లో వరెస్ట్ ప్లేయర్ అంటూ గిల్ ను ఆడిపారేసుకుంటున్నారు.