Congress: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అష్టలక్ష్మి దేవాలయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మధిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ తిరువూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయంలో హోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క భార్య నందిని హాజరయ్యి హోమంలో కూర్చొని భట్టి విక్రమార్క విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు. తిరువూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు భట్టి విక్రమార్క భార్య నందినిని ఘనంగా సత్కరించారు.
Read Also: TS Cabinet: ఈనెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం
ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క భార్య నందిని మాట్లాడుతూ.. నిన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని ఎందుకంటే ప్రజల మధ్య, దొరలకు మధ్య జరిగిన ఎన్నికలని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పది సంవత్సరాలుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అది చూసి భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు నేనున్నాను అంటూ భరోసా కల్పించి, ధైర్యాన్ని ఇచ్చారన్నారు. ఆ ధైర్యంతోనే ప్రజలలో పెద్ద మార్పు వచ్చిందన్నారు. మన బాధలను తీర్చడానికి మనకి ఒక నాయకుడు వున్నాడు అని ప్రజలకు భరోసా కల్పించారు భట్టి విక్రమార్క అని ఆయన భార్య నందిని తెలిపారు.
పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలకు వచ్చిన కొన్ని సమస్యలు భట్టి విక్రమార్కకి చెప్పుకున్నారని ఆమె తెలిపారు. ఆ సమస్యల పరిష్కారం నుంచి వచ్చిందే మా ఆరు గ్యారంటీల కార్డు అది ప్రజలలోకి పూర్తిగా వెళ్లి ప్రజలలో మార్పు వచ్చింది.. అందుకనే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని భట్టి విక్రమార్క సతీమణి నందిని పేర్కొన్నారు.