2016లో వచ్చిన బొమ్మల రామారం సినిమాతో ‘తిరువీర్’ వెండి తెరకు పరిచయమయ్యారు. ఘాజీ, ఏ మంత్రం వేసావె, శుభలేఖలు సినిమాల్లో నటించినా.. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలోని లలన్ సింగ్, 2020లో వచ్చిన పలాస 1978 సినిమాలో రంగారావు పాత్రలతో నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు ప్రముఖ దర్శకుల, నిర్మాతల దృష్టిలో పడ్డారు. సిన్ వెబ్ సిరీస్, టక్ జగదీష్ సినిమాలో తన నటనను నిరూపించుకున్నారు. ఇక 2022లో వచ్చిన ‘మసూద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మసూద హిట్ అవ్వడంతో తిరువీర్ పేరు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.
Also Read: RGV-Chiranjeevi: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. నెటిజన్స్ షాక్!
2023లో తిరువీర్ హీరోగా పరేషాన్ విడుదలయింది. ఈ సినిమాలో తిరువీర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆపై కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ చేశారు. తాజాగా తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నవంబర్ 7న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో తిరువీర్ పర్ఫామెన్స్ ఇరగదీశారు. తిరువీర్ కామెడీ టైమింగ్‌కు థియేటర్లో నవ్వులు పూస్తున్నాయి. అంతేకాదు నాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఓ సీన్‌లో అయితే తిరువీర్ ఒకేసారి నాలుగు వేరియేషన్స్ చూపించారు. మొత్తానికి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో తిరువీర్ మరో మెట్టు ఎక్కారు. తిరువీర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఫాన్స్ అంటున్నారు.
