O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో తిరువీర్, వెర్సటైల్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ..! సుకుమారి’. ‘శివం భాజే’ సినిమా తర్వాత గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ దర్శన్ కథ, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను టాలీవుడ్ హిట్ మెషిన్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా లాంచ్ చేశారు. రొమాన్స్, పల్లెటూరి అందాలు మరియు హిలేరియస్ కామెడీతో కూడిన ఈ ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వుల పండగ గ్యారెంటీ అనిపిస్తోంది.
ట్రైలర్ ప్రకారం.. ఊరిలో దామిని (ఐశ్వర్య రాజేష్) అంటే అందరికీ ఒక తెలియని భయం ఉంటుంది. దానికి కారణం ఆమెకు ఒక వింత సమస్య ఉండటమే. ఆమెను ఎవరైనా తాకితే చాలు.. అల్లాడిపోయేలా కరెంట్ షాక్ తగులుతుంది. ఈ విచిత్రమైన రహస్యాన్ని ఊరంతా దాచిపెట్టి, అమాయకుడైన మన హీరో (తిరువీర్)కు ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి పీటలెక్కిన తర్వాత అసలు విషయం తెలిసిన ఆ కొత్త మొగుడు ఎలాంటి తిప్పలు పడ్డాడు? ముట్టుకుంటే షాక్ కొట్టే భార్యతో కాపురం ఎలా చేశాడు? చివరికి ఈ విచిత్రమైన సమస్యను ఈ భార్యాభర్తలు ఎలా ఎదుర్కొని ఒక్కటయ్యారు? అనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు భరత్ దర్శన్ ఈ కథను అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎలిమెంట్స్‌తో సిద్ధం చేశారు. తిరువీర్ మరోసారి ఒక సరికొత్త తరహా కథను ఎంచుకుని, అమాయకమైన పల్లెటూరి యువకుడి పాత్రలో ఎంతో సహజంగా ఒదిగిపోయారు. కామెడీ టైమింగ్‌తో ఆయన పండించిన నవ్వులు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఐశ్వర్య రాజేష్ కూడా గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్తో మెప్పించింది. ఇక మురళీధర్ గౌడ్, ‘మ్యాడ్’ ఫేమ్ విష్ణు ఓయ్, ఝాన్సీ, ఆమని, ఆనంద్కోట జయరామ్ తమ మార్క్ కామెడీతో వినోదాన్ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు.
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?