NTV Telugu Site icon

Theft in Temple: ఆలయంలో చోరీకి యత్నం.. అసలు వేటి కోసం వచ్చారో తెలుసా..?

Theft In Temple

Theft In Temple

Theft in Temple: ఏ పని ప్రారంభించినా దేవుడా నీవే దిక్కు, తలపెట్టిన కార్యంలో విజయాన్ని ప్రసాదించు అని ఆ దేవునికి మొక్కి ఏ పనినైనా ప్రారంభిస్తారు, దేవుడిని నాకు కావలసింది ఇవ్వమని మొక్కుకునేవారు కొందరు, మొక్కిన మొక్కులు తీర్చుకునేందుకు గుడికెళ్లేవారు కొందరు, కానీ చేతులెత్తి మొక్కాల్సిన దేవుని సంపదనే దోచుకునే వాళ్ళు ఉంటారా? అంటే కచ్చితంగా ఉంటారు అనిచెప్పడానికి నిదర్శనమే తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో చోటు చేసుకున్న దొంగతనం.

Read Also: Kangana Ranaut First Look: చంద్రముఖిగా కంగనా రనౌత్.. ఫస్ట్ లుక్ అదుర్స్!

నలుగురు వ్యక్తులు తెనాలిలోని వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చారు.. కానీ, భక్తితో చేతులెత్తి మొక్కడానికి కాదు, వాళ్ళ చేతివాటం చూపించడానికి వచ్చారు. దేవస్థానం లో కేశఖండనశాలలోని హుండీ లాకర్ లో భద్రపరిచిన తల నీలాలను దొంగిలిస్తుండగా గమనించిన ఆలయ సిబ్బంది 100కి కాల్ చేయగా రంగంలోకి దిగిన పోలీసులు దొంగలని పట్టుకునేందుకు ప్రయత్నించారు.. అయితే, దొంగలను పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ రమేష్‌ను 12 అడుగుల ఎత్తు నుండి ఒక దొంగ కిందకి తోసేశారు. దీనితో కానిస్టేబుల్ రమేష్(29 ) కి తీవ్ర గాయాలు అయ్యాయి. రమేష్ పరిస్థితి విషమంగ ఉండడంతో గుంటూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. వన్‌ టౌన్‌ పోలీసులు తలనీలాలను దొంగలించిన నలుగురు దొంగలలో ఇద్దరిని అదుపులోనికి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారని త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం అని తెలిపారు. కాగా, ఆలయాల్లో చోరీలు, హుండీలు ఎత్తుకెళ్లిన ఘటనలు అక్కడక్కడ వెలుగుచూస్తూనే ఉన్నాయి.