NTV Telugu Site icon

Robbery: మర్రిచెట్టు తొర్రలో రూ.66 లక్షలు.. అవాక్కైన పోలీసులు

Banyan Tree

Banyan Tree

Robbery: ఏటీఎం నగదు నింపే వ్యాన్‌లో 66 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లి మర్రిచెట్టులో దాచారు. ఏటీఎంలో నగదు నింపే వ్యాన్‌లో పట్టపగలే లక్షల రూపాయలు దోచుకెళ్లారు దొంగలు. ఏకంగా రూ. 66 లక్షలను ఎక్కడ దాచాలో తెలియక మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టారు. ఒంగోలు పట్టణంలో గురువారం ఏటీఎంలో నగదు నింపే వ్యాన్‌లోంచి రూ.66 లక్షలు దోచుకెళ్లిన నిందితులను ప్రకాశం పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన డబ్బు మొత్తం మర్రిచెట్టు తొర్రలో పడి ఉంది.

Read Also: Jersey: గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని పోస్ట్ వైరల్..

ఒంగోలులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం దగ్గర ఈ ఘటన జరిగింది. దొంగిలించిన డబ్బు మొత్తం మర్రి తొర్రలో పడి ఉండడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. నిందితులను సీఎంఎస్‌ మాజీ ఉద్యోగి సన్నమూరు మహేష్‌బాబు (22), రాచర్ల రాజశేఖర్‌ (19), ఒంగోలు సీఎంఎస్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ గుజ్జుల వెంకట కొండారెడ్డి (40)గా గుర్తించారు.వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు సీఎంఎస్ సెక్యూరిటీ కంపెనీ సిబ్బంది తమ శాఖ నుంచి రూ.68 లక్షలు తీసుకున్నారని ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ అనీల్ తెలిపారు. కర్నూలు రోడ్డులోని వర్మ హోటల్ దగ్గర వాహనం ఆపి భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి రూ.66 లక్షల చోరీ జరిగినట్లు గుర్తించారు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, పోలీసులు మహేష్ బాబును పేర్నమిట్ట నుండి పట్టుకున్నారు. విచారించగా, వారు డబ్బును మర్రి చెట్టు కుహరంలో దాచారని చెప్పాడు. లింగారెడ్డి కాలనీలోని సీఎంఎస్‌ కార్యాలయం వద్ద రాజశేఖర్‌, కొండారెడ్డిని అనుచరులుగా అరెస్టు చేశారు.