NTV Telugu Site icon

Good Thieves: మంచి దొంగలు.. వృద్ధుడి ఇంట్లో ఏం దొరకలేదని ఎదురుడబ్బుచ్చి..

Good Thieves

Good Thieves

Good Thieves in Delhi: దొంగల పనేంటి..? బెదిరించామా, దోపిడీ చేశామా, వెళ్లిపోయామా, అంతే. అవతల వ్యక్తుల పరిస్థితి ఏంటి? వారి ధనవంతులా, కాదా? అనేది దొంగలకు అనవసరం. దోచుకోవడమే వారి ప్రధాన లక్ష్యం. కానీ.. అందరూ దొంగలు ఇలాగే ఉండరని, అప్పుడప్పుడు కొందరు మంచి దొంగలు కూడా వెలుగు చూశారు. దొంగలించిన సామాన్లు తిరిగి ఇచ్చేయడమో, ఏమీ లేవని తిరిగి దొంగలే ఆర్థిక సహాయం చేయడమో వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో తాజాగా అలాంటి వ్యవహారమే వెలుగుచూసింది. ఓ ఇంట్లో దోచుకుందామని వెళ్లిన దొంగలకు అక్కడి వారి ఆర్థిక పరిస్థితిని చూసి జాలి కలిగిందేమో.. వారే అక్కడ రూ.500 నోటు వదిలివెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Indonesia: ఇండోనేషియాలో పడవ మునిగి 15 మంది మృతి.. 19 మంది గల్లంతు

ఢిల్లీలో రోహిణిలోని సెక్టార్ 8లోని ఓ ఇంట్లో దొంగలకు చోరీకి విలువైనదేమీ దొరకకపోవడంతో రూ.500 నోటును వదిలివెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. జులై 20-21 మధ్య రాత్రి జరిగిన ఈ వింత ఘటన ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో తెరపైకి వచ్చింది. 80 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జులై 19న సాయంత్రం రామకృష్ణ, తన భార్యతో కలిసి గురుగ్రామ్‌లో నివసించే తమ కొడుకు వద్దకు వెళ్లాడు. జులై 21 తెల్లవారుజామున తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఇరుగుపొరుగు వారి నుంచి కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ప్రధాన గేటు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా దొంగలు ఏమీ దొంగిలించలేదని తెలిసింది. ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపాడు. ప్రధాన ద్వారం వద్ద రూ.500 నోటు పడి ఉందని చెప్పాడు.

Also Read: Twitter Logo: కనుమరుగుకానున్న ట్విట్టర్ పిట్ట.. కొత్త లోగో ‘ఎక్స్’!

తన ఇంట్లో విలువైన వస్తువులేవీ ఉంచుకోలేదని పోలీసులకు రామకృష్ణ తెలిపాడు. అల్మారాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు. తదుపరి విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.