ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దొంగలు హల్ చల్ చేశారు. సోమవారం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఇదే అదునుగా భావించిన దొంగలు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకొని భక్తుల నుండి నగదు దోచుకున్నారు దొంగలు. అయితే.. ములుగు జిల్లా లోని గోవిందా రావుపేట చంద్ర శేఖర్ రెడ్డి కుటుంబం కోడె కట్టే క్రమంలో వారి వద్ద నుండి దొంగలు డబ్బులు కొట్టేశారు.
Also Read : Ramcharan: మండు వేసవిలో చల్లటి స్ఫూర్తి పంచుతున్న రామ్‌చరణ్ ఫ్యాన్స్!
దీంతో.. ఆలయ ఎస్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆలయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న వేములవాడకి చెందిన గణేష్, మంచిర్యాల సతీష్ ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. చంద్ర శేఖర్ కి చెందిన 9 వేలతో పాటు మరో 26 వేలను దొంగల నుండి స్వాధీనం చేసుకున్న ఆలయ భద్రత (ఎస్పీఎఫ్) పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read : Devendra Fadnavis : కావాలనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారు..