Site icon NTV Telugu

Thief Letter : చిలిపి దొంగ.. అమ్మకు బాగాలేదు, లవర్ పుట్టిన రోజు అంటూ లెటర్ పెట్టి ఏకంగా..?

Thief Leaves Letter

Thief Leaves Letter

Thief Leaves Letter : తాజాగా తమిళనాడు రాష్ట్రంలో రిటైర్డ్ టీచర్ నివాసంలో దొంగ దోచుకున్నాడు. అయితే., దొంగిలించిన వస్తువులను ఒక నెలలో తిరిగి ఇస్తానని హామీ ఇస్తూ క్షమాపణ లెటర్ రాసి పెట్టి దొంగతనం చేసాడు. విశ్రాంత ఉపాధ్యాయులు అయిన సెల్విన్, అతని భార్య జూన్ 17న చెన్నైలో తమ కుమారుడిని కలవడానికి బయలుదేరినప్పుడు మేగ్నానపురంలోని సాతంకుళంలో ఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దంపతులు లేని సమయంలో ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి ఇంటి పనిమనిషి సెల్విని నియమించుకున్నారు యజమానులు. ప్రతిరోజులాగే జూన్ 26న సెల్వి సెల్విన్ ఇంటికి వెళ్లగా.. మెయిన్ డోర్ తెరిచి ఉండడంతో ఆమెకు అనుమానం వచ్చింది.

Team India-PM Modi: ప్రధాని మోడీతో భారత క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్!

దాంతో వెంటనే ఆమె సెల్విన్‌ కు సమాచారం అందించింది. సెల్విన్ ఇంటికి చేరుకుని చూడగా రూ.60 వేలు నగదు, 12 గ్రాముల బంగారు నగలు, ఒక జత వెండి సామాను దోచుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు సెల్విన్ ఇంటిని పరిశీలించినప్పుడు దొంగ వదిలిపెట్టిన క్షమాపణ లేఖను వారు కనుగొన్నారు. అందులో అతను క్షమాపణలు చెబుతూ.. దొంగిలించిన వస్తువులను ఒక నెలలో తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడు. “నన్ను క్షమించండి.. నెల రోజుల్లో తిరిగి అన్ని ఇచ్చేస్తాను. నా అమ్మకు బాగాలేదు… నా లవర్ పుట్టిన రోజు ఉంది కాబట్టి దొంగతనం చేస్తున్నాను..” అని లేఖలో పేర్కొన్నారు. దింతో మేఘానాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Satyabhama Movie: టాప్ 1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్న కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’!

Exit mobile version