NTV Telugu Site icon

Thief Arrested: దొంగ నుండి 45 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..

Police

Police

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 24 ఇళ్లలో దోపిడి చేసిన ఓ దొంగను శనివారం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ జంక్షన్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగ నుండి ఏకంగా 47.70 తులాల బంగారు ఆభరణాలు, 65 తులాల వెండి ఆభరణాలు రూ.34,500 నగదు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దొంగను రామారావుగా గుర్తించారు పోలీసులు.

Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్‌మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా..

ఇక రామారావు కరీంనగర్‌లో 13, సిద్దిపేటలో 6, ఇతర జిల్లాల్లో 13 దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని రాంనగర్‌ కు చెందిన టేకం రామారావు (38) గా అధికారులు నిర్ధారించారు. ఇక దొంగ నుండి 47.7 తులాల బంగారు ఆభరణాలు, 65 తులాల వెండి ఆభరణాలు రూ.34,500 నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామారావు రాష్ట్ర వ్యాప్తంగా 34 దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించారు.

Liquor Sales Prohibited: 5 రోజులు అక్కడ మద్యం అమ్మకాలు నిషేధం..

ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు కొన్ని హెచ్చరికలను జారీ చేశారు. ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఇంటికి తాళం వేశారో లేదో చెక్ చేసుకోవాలని కోరారు. అలాగే ఎవరైనా వేరే ప్రాంతాలకు కుటుంబ సభ్యులంతా వెళ్తే కచ్చితంగా దొంగల నుండి సంరక్షణ కోసం పోలీసులను సంప్రదించాలని తెలిపారు.