Shejal: గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ సమీపంలో శేజల్ నిద్రమాత్రలు మింగి మూడోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమేను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో ఆమే ప్రాణాల నుండి బయటపడింది. అయితే ఆమే ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య పై ఆరోపణలకు ఆధారాలు లేవు అంటున్నారని.. నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఆధారాలు ఉంటాయా అని శేజల్ అన్నారు. అలా కూడా తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని.. 6 నెలల నుండి ఫైట్ చేస్తున్నట్లు శేజల్ తెలిపారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా కేసును నీరు గారుస్తున్నారని ఆరోపించారు.
Read Also: Shine Tom Chacko: ఈ ‘దేవర’ విలన్.. మరో బాలయ్య లా కనిపిస్తున్నాడే..?
నిన్న హాస్పిటల్ లో కూడా తన అన్నని పోలీసులు కొట్టారని శేజల్ తెలిపింది. హాస్పిటల్ నుండి తనను వెళ్లిపోండి అంటూ.. పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంది. మరోవైపు నాకు సహహకరించే వాళ్లని కూడా బెదిరిస్తున్నారని.. తాను పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆమే తెలిపింది. మంత్రి కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేవు అన్నడం బాధ కలిగించిందన్నారు. న్యాయం చేయాల్సిన మంత్రే అలా మాట్లాడితే తనకు న్యాయం ఎవరు చేస్తారని శేజల్ అంటోంది. ఒక ఎమ్యెల్యేని కాపాడుకోవడానికి తన క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నారని దుయ్యబట్టింది.
Read Also: Sharwanand : మెగా లిటిల్ ప్రిన్సెస్ కు స్పెషల్ గిఫ్ట్ పంపిన శర్వానంద్..
మరోవైపు వాళ్ళ స్వార్ధ రాజకీయాల కోసం తనను బలి చేస్తున్నారని శేజల్ తెలిపింది. బతికి సాధించేది ఏం లేదని అర్థమైంది.. అందుకే చనిపోదాం అనుకున్నట్లు బాధిత యువతి పేర్కొంది. తనను మాదాపూర్ హాస్పిటల్ నుంచి ఎవరు డిశ్చార్జ్ చేసి.. అమీర్ పేట తీసుకొచ్చారో తెలియదన్నది. ఇప్పుడు అమీర్ పేట్ వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళు కూడా తనను వెళ్ళిపోమని అంటున్నారని.. నడి రోడ్డు పై ఉన్నట్లు శేజల్ తెలిపింది.
