NTV Telugu Site icon

Health Tips : శరీరానికి హాని కలిగించే ఆహారాలు ఏంటో తెలుసా..?

Health

Health

హానికరమైన ఆహారాలు మార్కెట్‌లో ఈజీగా లభిస్తాయి. చాలా మంది ఇలాంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని ఇంటికి తెచ్చి తింటారు. అయితే, వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి. ఈ ఆహారాలు ఒక్కరోజులో వచ్చే సమస్య కాదు. ఇది మన శరీరానికి జీవితాంతం సమస్యగా మారుతుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు సహా శరీరంలోని ఇతర కీలక అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం. ఓ విదేశీ కంపెనీ ఈ ప్రక్రియను స్టార్ట్ చేసింది. ముఖ్యంగా నాన్ వెజ్ హాట్ డాగ్స్ హానికరమైనవని నిపుణులు వెల్లడించారు. ఎందుకంటే వాటిలో మాంసంతో వచ్చే కొన్ని హానికరమైన బ్యాక్టీరియా కూడా ఉంటుందని తెలిపారు. ఇది కాలక్రమేణా పెరుగుతుంది. ఇది మన పొట్ట, ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది అని చెప్పారు.

Also Read : Rains: ఈ వేసవిలో 28 శాతం అధిక వర్షపాతం.. ఐఎండీ రిపోర్ట్..

అయితే వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే అవి టెస్టీగా ఉంటాయి గనుకా.. దీన్ని తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడం తగ్గించండి. అనేక విదేశీ కంపెనీలు శాండ్‌విచ్‌లను తయారు చేస్తున్నాయి. రుచి విషయంలో కూడా కంపెనీలు రాజీపడవు. ముఖ్యంగా అవి చాలా టెస్టీగా కూడా ఉంటాయి. అందుకే అందరూ ఇష్టంగా వాటిని తింటుంటారు. కానీ ఎక్కువ శాండ్‌విచ్‌లు తినడం మీ ఆరోగ్యానికి హానికరం. ఇది కడుపు సమస్యలను కలిగిస్తుంది. ప్రతిరోజూ
టిఫిన్ చేసే సమయంలో తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకావం ఉంది.

Also Read : Kakinada Crime: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. చావలేదని ఆస్పత్రి పైనుంచి దూకి ఆత్మహత్య

ప్రపంచ జనాభా పెరిగుతుంది.. కానీ జనాభా ప్రకారం పాల ఉత్పత్తి ఎక్కువగా లేదు. కాబట్టి మార్కెట్ లో క్లీన్ చీజ్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. జున్ను ప్యాక్ చేసిన విధానం దానిని తాజాగా చేస్తుంది. కానీ ఇందులో ట్రాన్స్ ఫ్యాట్, ప్రిజర్వేటివ్స్, వెజిటబుల్ ఆయిల్స్ ఉంటాయి. ఇది మన శరీరానికి అస్సలు మంచిది కాదు. నకిలీ ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కల్తీకి దూరంగా ఉండాలి అని నిపుణులు వెల్లడిస్తున్నారు. మార్కెట్‌లో అనేక రకాల బ్రాండ్‌ల కూల్ డ్రింగ్స్ దొరుకుతున్నాయి. వేసవి వచ్చిందంటే ఈ శీతల పానీయాలకు గిరాకీ పెరుగుతుంది. మండే ఎండలో ఇవి చల్లదనాన్ని అందిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో దీన్ని తాగేందుకు ఇష్టపడుతున్నారు.

Also Read : Alekhya Tarakaratna : ఈ జన్మకు నువ్వూ నేను మాత్రమే.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి

అయితే ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా కాలేయం, కిడ్నీ, దంతాలు, బోలు ఎముకల వ్యాధి, డిప్రెషన్, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీంతో షుగర్ వ్యాది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరిగిందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. చాలామంది ఇంట్లో వండిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. మార్కెట్‌లో విక్రయించే ఉత్పత్తులు మన ఆరోగ్యానికి హానికరం..కానీ ఇంట్లో వండిన ఆహారం మన ఆరోగ్యానికి మంచిదని వారు తెలిపారు. సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోవడం సరైన ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యాధులు కూడా సంక్రమించవు. మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోండి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను తీసుకోవాల్సిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు Ntvtelugu.com బాధ్యత వహించదు.

Show comments