NTV Telugu Site icon

Eye Problems: ఈ లక్షణాలుంటే చూపు మందగించొచ్చు.. జాగ్రత్తలు పాటించండి

Eye Problems 10

Eye Problems 10

ప్రస్తుతం ఒకటో తరగతి చదివే పిల్లల నుంచి వృద్ధుల వరకు కంటి సమస్యతో బాధ పడుతున్నారు. రాను రాను కంటి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా మందిలో చిన్నతనంలోనే చూపు మందగిస్తోంది. పాఠశాలల్లో బోర్డుపై ఉపాధ్యాయుడు రాసింది చదవాలంటే కళ్లజోడు తప్పకుండా కావాల్సిందే. అయితే కంటి చూపు మందగించే టప్పుడు కొన్ని లక్షణాలు కనబడతాయని.. అప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. చూపు మందగించడానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. అలాగే ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

READ MORE: Mamata Banerjee: లైంగిక వేధింపుల ఆరోపణ.. ప్రధాని, గవర్నర్‌పై మమతా బెనర్జీ ఆగ్రహం..

పలు లక్షణాల ద్వారా కంటి చూపు మందగించే అవకాశం ఉందని ముందే గమనించాలి. అవి ఏంటంటే.. త‌ర‌చూ క‌ళ్లు నొప్పిగా అనిపిస్తున్నా లేదా త‌ల‌నొప్పి త‌ర‌చూ వ‌స్తున్నా.. కంటి సమస్య వచ్చిందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. వెంటనే పరీక్షలు చేయించడం మంచింది. ఏదైనా స‌మ‌స్య ఉంద‌ని తేలితే డాక్టర్ల సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. కొంద‌రికి చీక‌టి ప‌డుతున్న కొద్దీ కళ్లు స‌రిగ్గా క‌నిపించ‌వు. దీన్నే రేచీక‌టి అంటారు. ఈ స‌మ‌స్య ఉన్న వాళ్లుకు కళ్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. వీరు ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయట పడేందుకు ప్రయత్నించాలి. కంప్యూట‌ర్ తో కాలం గడిపే వాళ్లకు ఈ సమస్య వస్తుంది. కంప్యూటర్ ఎదుట గంట‌ల త‌ర‌బ‌డి కూర్చున్నా.. లేదా నీళ్లు త‌క్కువ‌గా తాగినా.. క‌ళ్లు పొడిబారుతుంటాయి. అయితే ఈ రెండు కార‌ణాలు కాకున్నా.. క‌ళ్లు అలాగే పొడిబారుతుంటే.. ఏదో స‌మ‌స్య ఉంద‌ని అర్థం చేసుకోవాలి. వెంట‌నే వైద్యులను సంప్రదించాలి. కంప్యూట‌ర్లు, ఫోన్లు, టీవీల‌ను ఎక్కువ సేపు చూస్తే క‌ళ్లు మ‌స‌కబారిన‌ట్లు క‌నిపిస్తాయి. వాటిని చూస్తున్నప్పుడు కొంత సేపు కళ్లు సరిగ్గా కనిపించవు. కాసేపటి తర్వాత మ‌ళ్లీ బాగానే క‌నిపిస్తుంది. ఇలాంటి సమస్యలు ఎవ్వరికి తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు మందులు వాడాలి.