NTV Telugu Site icon

Teeth For Children: పిల్లలకు పళ్లు వచ్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Teeth For Children

Teeth For Children

Teeth For Children: పిల్లల పుట్టుక ఓ సంతోషకరమైన సందర్భం. అయితే, తల్లిదండ్రులకు అనేక సవాళ్లతో కూడుకున్న సమయం అది. ఈ సవాళ్లలో పిల్లల ఒకటి దంతాల ప్రక్రియ. దంతాలు వచ్చే సమయంలో పిల్లలు నొప్పి, వాపు, చిరాకు, నిద్రలేమి వంటి అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. పిల్లల అభివృద్ధిలో దంతాలు ఒక ముఖ్యమైన దశ. కానీ, అది వారికి బాధాకరమైన అనుభవంగా కూడా ఉంటుంది. పళ్ళు వచ్చే సమయంలో పిల్లలకి నిద్ర పట్టకపోవడం చాలా సాధారణం. దీనికి కారణం ఏమిటంటే.. దంతాలు వచ్చే సమయంలో పిల్లల చిగుళ్ళు ఉబ్బి నొప్పిగా మారుతాయి. దీని కారణంగా వారు నిద్రించడానికి ఇబ్బంది పడతారు. పళ్లు వచ్చే సమయంలో మీ బిడ్డకు మంచి నిద్ర రావడానికి కొన్ని చిట్కాలు చూద్దాం.

Read Also: India-China: ఎల్ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్‌ చైనా పురోగతి సాధించాయి..

మొదటగా మీ శిశువు చిగుళ్ళను సున్నితంగా మసాజ్ చేయండి. ఇది వారి చిగుళ్ళ వాపును తగ్గిస్తుంది. అంతేకాకుండా నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. మీరు మీ వేలు లేదా మృదువైన తడి వస్త్రాన్ని ఉపయోగించి మెత్తగా మసాజ్ చేయాలి. అలాగే మీ బిడ్డకు పెరుగు లేదా పండ్లు వంటి చల్లని పదార్థాలను తినిపించండి. ఇది పిల్లల కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. అంతేకాకుండా, వారి చిగుళ్ళు చల్లదనాన్ని పొందుతాయి. దాంతో కాస్త నొప్పి నుండి ఉపశమనం పొందుతాయి.

Read Also: Wriddhiman Saha Retirement: క్రికెట్‭కు గుడ్ బై చెప్పిన టీమిండియా వికెట్ కీపర్

చిగుళ్లలో వాపు, నొప్పి కారణంగా, పిల్లలు నిద్రలేమి, తినడంలో ఇబ్బంది ఇంకా విపరీతమైన చిరాకు వంటి సమస్యలను కలిగి ఉంటారు. ఈ సమయంలో టెథర్‌లు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. టెథర్‌లు అంటే సిలికాన్, రబ్బరు వంటి సురక్షితమైన పదార్థాలతో తయారు చేయబడిన బొమ్మలు. టెథర్‌లు వాడి నమలడం వల్ల చిగుళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది నొప్పి, వాపును తగ్గిస్తుంది. దంతాల సమయంలో, చిగుళ్ళలో వాపు ఇంకా నొప్పి కారణంగా అతిసారం వంటి సమస్యలు సంభవించవచ్చు. ఈ విరేచనాలు సాధారణంగా తేలికపాటివి. కొన్ని రోజుల్లో దానంతటదే ఏవ్ తగ్గుతాయి. ఆ సమయంలో, శిశువులలో డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, తల్లిపాలను బిడ్డకు ఓదార్పునిస్తుంది. మీ బిడ్డ కోసం నిశ్శబ్ద, ప్రశాంత వాతావరణాన్ని సృష్టించండి. దీంతో వారికి నిద్ర సులువు అవుతుంది.

Show comments