Site icon NTV Telugu

MAY 01 : ప్రభుత్వం కొత్త నిబంధనలు.. ఇవాళ్టి నుంచి మీ జేబుకు చిల్లే..?

Money

Money

ఇవాళ్టి( మే 1 ) నుంచి చాలా మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతాయి. మే 1 నుంచి ప్రభుత్వం కొన్ని నిబంధనలను మార్చనుంది. GST, CNG-PNG, గ్యాస్ సిలిండర్లు, మ్యూచువల్ ఫండ్స్ తో సహా అనేక నిమయాల్లో మార్పులు ఉంటాయి. బ్యాటరీతో నడిచే వెహికిల్స్ కు సంబంధించిన నిబంధనలలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఈ మార్పులు సామాన్యుల జేబుపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Also Read : Heavy Rains in AP: ఏపీని ముంచెత్తిన వాన.. ఐఎండీ వార్నింగ్

CNG ధరలు ప్రతి నెల మొదటి రోజె లేదా మొదటి వారంలో మారుతాయి. పెట్రోలియం కంపెనీలు ప్రతి నెల మొదటి వారంలో గ్యాస్ ధరలను మారుస్తాయి. ఏప్రిల్ లో ఢిల్లీ, ముంబైలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు తగ్గాయి.
ఈ నేపథ్యంలో మే 1న కూడా సీఎన్జీ, పీఎన్జీ ధరల్లో మార్పు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే జీఎస్టీకి సంబంధించిన రూల్స్ లో చాలా మార్పులు తీసుకువచ్చాయి. మారిన ఈ నిబంధనలను ప్రారిశ్రామికవేత్తలు పాటించాలి. ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదును ఏడు రోజుల్లోగా ఇన్ వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో అప్ లోడ్ చేయడం తప్పనిసరి.. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుంది.

Also Read : AdiReddy Apparao: ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లకు మే 12 వరకు రిమాండ్‌

మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలను మార్చింది. దీని ప్రకారం.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించే డిజిటల్ వాలెట్ RBI KYC పొందాలి. ఈ నియమం ఇవాళ ( మే 1,2023 ) నుంచి అమలులోకి వస్తుంది. ఇవాళ్టి నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకుండా లావాదేవీని నిలిపివేస్తే.. రూ. 10+GST జరిమానా విధించబడుతుంది. అలాగే.. ఖాతాలో అవసరమైన బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఏటీఎం లావాదేవీ విఫలమైతే సమస్యను పరిష్కరించడానికి పీఎన్బీ మార్గదర్శకాలను రూపొండించింది. ఏటీఎం లావాదేవీ వైఫల్యం గురించి కస్టమర్ ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదు స్వీకరించిన ఏడు రోజుల్లో బ్యాంక్ సమస్యను పరిష్కరిస్తుంది. 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించడంలో బ్యాంక్ ఫెయిల్ అయితే.. కస్టమర్ కు బ్యాంక్ రూ.100 చెల్లిస్తుంది. వారికి రేటు ప్రకారం పరిహారం చెల్లిస్తామని బ్యాంక్ తెలిపింది. ఇవాళ్టి నుంచి బ్యాటరీతో నడిచే టూరిస్ట్ వాహనాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి లైసెన్స్ రుసుమును వసూలు చేయదని వెల్లడించింది.

Exit mobile version