మరో మూడు రోజుల్లో ప్రపంచ కప్ మహా సంగ్రామం మొదలవనుంది. ఇప్పటికే వరల్డ్ కప్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తమ ఫేవరేట్ జట్లను వరల్డ్ కప్ లో చూసేందుకు ఎంతో ఆత్రుతతో ఉన్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రపంచ కప్ లు గెలిచిన సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. 1983లో తొలిసారిగా టీమిండియా ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్ గా బాధ్యతలు వహించాడు. ఆ తర్వాత.. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2011 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. ఇలా రెండుసార్లు టీమిండియా వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు భారత్ మూడోసారి ప్రపంచకప్ గెలవాలని కసితో ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టనుంది.
భారత్‌లో టాప్-10 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్‌ల జాబితా ఇదే..
అయితే ప్రపంచ కప్ గెలవాలంటే.. బ్యాట్స్‌మెన్లతో పాటు బౌలర్లు కూడా కీలక బాధ్యత వహించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రపంచకప్ గెలవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈసారి బౌలర్లపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుందని పలువురు క్రికెట్ దిగ్గజాలు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బౌలర్లు రాణించారంటే వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రపంచకప్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు ఎవరో తెలుసుకుందాం. ఈ జాబితాలో జహీర్ ఖాన్ అగ్ర స్థానంలో ఉన్నాడు. అతను 23 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో జావగల్ శ్రీనాథ్ రెండో స్థానంలో ఉన్నాడు. జవగల్ శ్రీనాథ్ 34 మ్యాచ్‌ల్లో 44 మంది ఆటగాళ్లను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఉన్నాడు. భారత్ తరఫున మహ్మద్ షమీ 11 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 31 వికెట్లు పడగొట్టాడు. ఈ విధంగా భారత్ తరఫున ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-3 బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్, మహ్మద్ షమీ ఉన్నారు. ఆ తర్వాత ఈ జాబితాలో భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్ 5లో ఉన్నాడు.