వరల్డ్ కప్ మహా సంగ్రామానికి మరొక రోజు మాత్రమే సమయం ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య టైటిల్ పోరు జరుగనుంది. అయితే ఈ మహా సంగ్రామాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి అభిమానులు భారీ స్థాయిలో అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. ఇప్పటికే హోటళ్లు, పలు రెస్టారెంట్లు హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశాయి.
Akhil Akkineni: అజ్ఞాతంలో అయ్యగారు.. ఎన్నాళ్లకు దర్శనమిచ్చారు
ఫైనల్ మ్యాచ్ దాదాపు 1.25 లక్షల మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు స్టేడియంకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ కోసం కొందరు అతిరథులు స్టేడియానికి రానున్నారు. అందులో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోదీ. అయితే స్టేడియంకు వస్తారన్నది ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.. కానీ నివేదిక ప్రకారం, ఈ మ్యాచ్‌ను చూడటానికి ప్రధాని మోడీ మైదానానికి వెళ్లవచ్చు. మరోవైపు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ చూసేందుకు మైదానానికి వస్తున్నారు.
Vijayasai Reddy: పచ్చ పార్టీకి కాపలా కాయడం ఆమెకు మాత్రమే సాధ్యం
వీరే కాకుండా కొంతమంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, బాలీవుడ్ తారలు, మాజీ క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్‌ని చూసేందుకు స్టేడియానికి వస్తున్నారు. వీరిలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ. ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియానికి వస్తున్న ప్రత్యేక వ్యక్తుల జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం.
Akhil Akkineni: అజ్ఞాతంలో అయ్యగారు.. ఎన్నాళ్లకు దర్శనమిచ్చారు
ప్రధాని మోదీ
కపిల్ దేవ్
ఎం.ఎస్. ధోని
సచిన్ టెండూల్కర్
అమిత్ షా
జై షా
రోజర్ బిన్నీ
హార్దిక్ పాండ్యా
రాజీవ్ శుక్లా
Atlee : నా సినిమాలో నటించేందుకు రజనీ సార్ ఎప్పుడూ రెడీగానే వుంటారు..
వీరందరితో పాటు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ, అతని కుటుంబం, అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ, పలువురు వ్యక్తులు ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు హాజరుకానున్నారు. ఇక.. బాలీవుడ్ తారల్లో.. రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మలోహత్రా, కియారా అద్వానీ, జాన్ అబ్రహం, విక్కీ కౌశల్, అనుష్క శర్మతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్టేడియానికి రానున్నారు. వీరితో పాటు.. రజనీకాంత్, అభిషేక్ బచ్చన్, సునీల్ సేథీ, కెఎల్ రాహుల్ భార్య అతియా సేథీ, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సోహైల్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ సహా పలువురు బాలీవుడ్ సూపర్ స్టార్లు ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు రానున్నారు.