NTV Telugu Site icon

Richest MLA’s in India: ఇండియాలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు వీళ్లే.. ఏపీ సీఎం జగన్, చంద్రబాబు ఏ ప్లేస్లో ఉన్నారంటే..!

Dk 1

Dk 1

ఇండియాలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాను ఓ నివేదిక విడుదల చేసింది. అందులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది. అతని ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) నివేదిక పేర్కొంది. అంతేకాకుండా దేశంలోనే అత్యధిక సంపన్న శాసనసభ్యులు కర్ణాటకలో ఉన్నారని నివేదిక తెలిపింది. 20 మంది సంపన్న ఎమ్మెల్యేలలో 12 మంది కర్ణాటకకు చెందిన వారే ఉన్నారు. మరోవైపు ఆ జాబితాలో ఏపీ ముఖ్యమత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నారు.

Poultry Farms: వర్షాకాలంలో కోళ్ల ఫారాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో డీకే శివకుమార్ అగ్రస్థానంలో ఉండగా.. కర్ణాటకకు చెందిన మరో ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి గౌడ రెండో స్థానంలో నిలిచారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం పుట్టస్వామిగౌడ్ ఆస్తుల విలువ రూ.1,267 కోట్లు. మూడో స్థానంలో కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చెందిన అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే ప్రియాకృష్ణ నిలిచారు. ఆయన వయస్సు 39 ఏళ్ల అయినా.. అతని ఆస్తులు రూ.1,156 కోట్లుగా ప్రకటించారు. ఇక ఇండియాలో టాప్- 10 సంపన్న శాసనసభ్యుల జాబితాలో ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టీడీపీకి చెందిన నారా. చంద్రబాబు నాయుడు(4వ స్థానం, 668 crore), బిజెపికి చెందిన జెఎస్ పటేల్(5వ స్థానం, 661 crore), కాంగ్రెస్‌కు చెందిన బిఎస్ సురేష్(6వ స్థానం, 648 crore), వైఎస్‌ఆర్‌సిపికి చెందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(7వ స్థానం, 510 crore), బిజెపికి చెందిన పరాగ్ సింగ్(8వ స్థానం, 500 crore), కాంగ్రెస్‌కు చెందిన టిఎస్ బాబా(9వ స్థానం, 500 crore) మరియు బిజెపికి చెందిన మంగళప్రభాత్ లోధా(10వ స్థానం, 441 crore) ఉన్నారు.

Richest MLA in India: ఇండియాలో అత్యంత సంపన్న ఎమ్మెల్యే డీకే శివకుమార్.. ఎన్ని కోట్ల ఆస్తులో తెలుసా..!

మరోవైపు భారతదేశంలోని టాప్ 10 పేద ఎమ్మెల్యేల జాబితాలో బీజేపీకి చెందిన నిర్మల్ కుమార్ ధార, ఇండిపెండెంట్ మకరంద ముదులి, ఆప్‌కి చెందిన నరీందర్ పాల్ సింగ్ సావ్నా మరియు నరీందర్ కౌర్ భరాజ్, జేఎంఎంకు చెందిన మంగళ్ కలింది, టీఎంసీకి చెందిన పుండరీకాక్ష్య సాహా, కాంగ్రెస్‌కు చెందిన రామ్ కుమార్ యాదవ్, బీఎస్పీకి చెందిన నివ ర్యాంగ్ అనిల్ కుమార్ (బీజేపీకి చెందిన ప్రదన్ అనిల్ కుమార్ అనిల్ కుమార్) ఉన్నారు.

28 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 4,001 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్‌ల ఆధారంగా ADR నివేదిక రూపొందించబడింది. విశ్లేషించిన 4,001 మంది ఎమ్మెల్యేలలో 44 శాతం (1,777) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 28 శాతం మంది ఎమ్మెల్యేలు హత్యలు, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. కేరళలో అత్యధిక సంఖ్యలో క్రిమినల్ కేసులు (70%), బీహార్ (67%), ఢిల్లీ (63%), మహారాష్ట్ర (62%), తెలంగాణ (61%), తమిళనాడు (60%) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.