Site icon NTV Telugu

OTT : ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలు ఇవే

Ott

Ott

కొత్త సినిమాలు రిలీజయ్యాక థియేటర్లలో చూడ్డం కొన్నిసార్లు వీలు పడదు. అలాంటి వారు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.. అక్టోబర్‌ లాస్ట్‌ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న సినమాలలో ధనుష్‌ డైరెక్షన్‌ చేసిన ఇడ్లీకొట్టు ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. తమిళ్‌లోఇడ్లీ కడాయ్‌గా, తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్‌తో అక్టోబర్ 1న గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో థనుష్ రెండు వైవిధ్యమైన షేడ్స్‌లో కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. రిలీజై నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 29న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి సిద్దమైంది.

మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై రికార్డులు తిరగరాసిన సినిమా ‘కొత్త లోక: చాప్టర్‌ 1’. మలయాళంలో తెరకెక్కిన మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీ. తెలుగులో కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ తనదైన యాక్షన్‌తో ఆకట్టుకోగా, సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల వసూళ్లతో దుమ్ములేపింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. అని అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతూ అక్టోబర్‌ 31నుంచి స్ట్రీమింగ్‌ అని జియో హాట్‌స్టార్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సిద్ధార్థ్‌ మల్హోత్రా, జాన్వీ కపూర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం పరమ్‌ సుందరి . తుషార్‌ జలోటా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకువచ్చి ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ఓటీటీలో సందడి చేయబోతున్నట్లు న్యూస్‌ వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

థియేటర్‌తో పాటు ఓటీటీలో విడుదలైన సినిమాలు కూడా స్పెషల్‌ ఆడియెన్స్‌ ఉన్నారనే విషయం తెలిసిందే. ఓటీటీ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ ప్రేక్షకులను అలరించేందుకు తక్షకుడు అనే యాక్షన్‌ ఫిల్మ్‌తో వస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈసినిమా విడుదల కానుంది. వినోద్‌ దర్శకత్వంలో ఇది రూపొందిన ఈ సినిమా… ‘వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు..’ అంటూ ఓ పోస్టర్‌ను పంచుకున్నారు మూవీ టీం.

తమిళ నటుడు విజయ్ ఆంటోని తన కెరీర్‌లో 25వ చిత్రంగా రూపొందిన శక్తి తిరుమగన్‌, తెలుగులో ‘భద్రకాళి’ పేరుతో థియేటర్లలోకి తీసుకొచ్చారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో విజయ్ ఆంటోని తన నటనతో మెప్పించాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ఈ 24 నుంచి ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Exit mobile version