NTV Telugu Site icon

Water Deficiency : శరీరంలో నీటి శాతం పెంచే పండ్లు, కూరగాయలు ఇవే..

Fruits10

Fruits10

వేసవి వచ్చిందంటే కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. దీనితోపాటుగా కొన్ని రకాల పండ్లు తినాలి. అలా చేస్తే మీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగకు జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ వేడిని తట్టుకోవాలంటే మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతోపాటు కొన్ని రకాల పండ్లు తింటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. అలా చేస్తే శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ వేడితో అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఆ లోపాన్ని తీర్చకపోతే డీహైడ్రేషన్ సంభవించవచ్చు.

READ MORE: CM YS Jagan: జనంలోకి సీఎం జగన్‌.. రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..

కానీ వేడి కారణంగానే కాదు, విరేచనాలు, వాంతులు, జ్వరం మొదలైన వాటి వల్ల కూడా శరీరంలో నీటి లోపం సంభవించవచ్చు. శరీరంలో నీటి లోపం వల్ల నీటితోపాటు మినరల్స్ లోపానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం లోపాన్ని భర్తీ చేయడానికి పండిన అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం మంచిది. వేసవిలో కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. వేసవిలో నిమ్మరసం పుష్కలంగా దొరుకుతుంది. చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. నిమ్మ రంసంలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ ఉన్న పండ్లను తింటే రోజంతా ఫ్రెస్ గా ఉంటారు. కాని నిమ్మరసంలో ఎక్కువ చక్కెరను జోడించవద్దు. నిమ్మకాయల్లో 88 శాతం నీరు ఉంటుంది.

వేసవిలో ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. వేసవిలో కాస్త ఉపశమనం పొందాలంటే ఈ పండును తినవచ్చు. ఇది శరీరంలో నీటి కొరతను భర్తీ చేస్తుంది. పుచ్చకాయలో 90శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్-ఎ, విటమిన్-సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్, మెగ్నీషియం కూడా ఉన్నాయి. మామిడి.. పండ్లలో రారాజు. ఈ పండులో విటమిన్ ఎ, సి, ఫైబర్, సోడియం, 20 కంటే ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి. ఈ పండు తినడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడిలో 88 శాతం నీరు ఉంటుంది. కూరగాయల్లో టామాటా, దోసకాయ ఎక్కువగా తినాలి. టమాటాలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సి, క్రోమియం, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, ఫైటోకెమికల్స్ ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి.
దోసకాయ డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది.