Site icon NTV Telugu

Year Ender 2023: ఈ సంవత్సరం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు వీళ్లే..

Cricketrs

Cricketrs

2023 సంవత్సరం వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్త సంవత్సరం 2024కు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అయితే.. క్రికెట్ అభిమానులు కూడా ఈ సంవత్సరంలోని జ్ఞాపకాలు, మధురక్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం.. వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడం ఓ చెత్త జ్ఞాపకం. అంతేకాకుండా.. ఈ సంవత్సరం చాలా మంది ఆటగాళ్ళు క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అందులో చాలా మంది ఆటగాళ్లు వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత మాత్రమే క్రికెట్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించారు.

CM YS Jagan: ఈ నెల 20న సీఎం జగన్‌ విజయవాడ పర్యటన

ఈ సంవత్సరం ఏఏ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించారంటే..?
టీమిండియా సీనియర్ ప్లేయర్.. టీ20 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు జోగిందర్ శర్మ ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ-20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో చివరి ఓవర్‌ బౌలింగ్‌ చేసి మిస్బా ఉల్‌ హక్‌ వికెట్‌ పడగొట్టాడు. జోగిందర్ శర్మతో పాటు మురళీ విజయ్, మనోజ్ తివారీ, అంబటి రాయుడు ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక.. విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాకు చెందిన డ్వేన్ ప్రిటోరియస్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనితో పాటు.. లెజెండ్ క్రికెటర్ హషీమ్ ఆమ్లా కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడనప్పటికీ.. ఈ సంవత్సరం అతను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు.

Covid Alert: పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలి

విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీ కూడా ఈ సంవత్సరం రిటైర్మెంట్ ప్రకటించారు. మొయిన్ అలీ యాషెస్ ఆడేందుకు తన రిటైర్మెంట్‌ను కూడా వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత అతను మళ్లీ రిటైరయ్యాడు. ఇటీవల భారత్ లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత.. చాలా మంది ఆటగాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. వారిలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ కేవలం 24 సంవత్సరాల వయస్సులో వన్డే ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ వరల్డ్ కప్ తర్వాత రిటైరయ్యారు. వీరే కాకుండా రిటైర్మెంట్ ప్రకటించని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే 2023 వరల్డ్ కప్ వారికి చివరి ప్రపంచకప్.

Exit mobile version