NTV Telugu Site icon

Sunill Gavaskar: ఇక సీనియర్ల రిటైర్మెంట్లు ఉండొచ్చు.. హార్దిక్‌కు కెప్టెన్సీ!

Sunil Gavaskar

Sunil Gavaskar

Sunill Gavaskar: టీ20 వరల్డ్ కప్‌లో మొదటి నుంచి అద్భుతంగా రాణించిన టీమిండియా సెమీస్‌లో ఉసూరుమనిపించింది. టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరగడంతో క్రీడాభిమానులు నిరాశను వ్యక్తపరస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినా ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీసీఐ మొదలుకొని కోచ్‌లు, ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు.

Vande Bharat Express: దక్షిణ భారత్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాశీ దర్శన రైలును ప్రారంభించిన ప్రధాని

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ వెనుదిరిగిన నేపథ్యంలో జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లు కొంతమంది కెరీర్‌కు వీడ్కోలు పలికే ఆస్కారముందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా రోహిత్‌ శర్మ తర్వాత హార్దిక్‌ పాండ్య జట్టు కెప్టెన్సీ చేపట్టే ఆస్కారం ఉందని కూడా చెప్పాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తొలిసారే గుజరాత్‌ టైటాన్స్‌ జట్టును గెలిపించాడని, కావున భవిష్యత్‌లో టీమిండియా బాధ్యతలు అతడికి అప్పగించే అవకాశం ఉందన్నాడు. టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత కొందరు ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకోవచ్చని, దీని గురించి వారు తప్పకుండా ఆలోచిస్తారని అన్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, అశ్విన్‌, దినేశ్‌ కార్తీక్‌ లాంటి 30ల్లో ఉన్న సీనియర్‌ ఆటగాళ్లు ఈ కప్పులో నిరాశపర్చిన విషయం తెలిసిందే.

Show comments