హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఆదివారం సాయంత్రం నగరంలోని పలు చోట్ల కుండపోత వర్షం పడుతుంది. ఉదయం నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణం.. గత గంట నుంచి ఎడతెరిపి లేని వాన పడతుంది. పంజాగుట్ట, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. అలాగే ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, అంబర్‌పేట్, మలక్‌పేట్‌లో భారీ వర్షం కురుస్తుంది.
Read Also: Child Kidnap: ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్.. ఏడుగురి సిబ్బందిపై వేటు
భారీ వర్షంతో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలుస్తుంది. ఈరోజు ఆదివారం కావడంతో ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఉండరు. అందుకోసమని.. ట్రాఫిక్కు ఎలాంటి సమస్య లేదు. కానీ.. భారీ వర్షంతో రోడ్లన్నీ నీట మునిగాయి. మరోవైపు.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా.. రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: Bandi Sanjay: హరీష్ రావు పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..