NTV Telugu Site icon

Vinesh Phogat: వినేష్ ఫోగట్‌పై కుట్ర జరిగిందా? స్పందించిన ఫోగట్‌ సోదరి బబిత..

Vinesh Phogat

Vinesh Phogat

పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చాలా మంది వినేష్ ను కోరారు. వినేష్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటినపై సోదరి బబితా ఫోగట్ బాధను వ్యక్తం చేసింది. “ఇది నాకు, నా కుటుంబానికి మాత్రమే కాదు. యావత్ దేశం బాధిస్తోంది. వినేష్‌కి మనమందరం అండగా ఉంటాం. ఆమెతో మాట్లాడి మళ్లీ మైదానంలోకి తీసుకొచ్చి 2028 ఒలింపిక్స్‌ ఆడేందుకు ధైర్యం కల్పిస్తాం.” అని పేర్కొంది.

READ MORE: Telangana is a Future State: ట్యాగ్​ లైన్​ ఖరారు చేసిన సీఎం రేవంత్​ రెడ్డి..

తాజాగా వినేష్ ఫోగట్ పై కుట్రలు జరిగాయని నెట్టింట చర్చ నడుస్తోంది. దీనికి ఆమె సోదరి సమాధానమిచ్చింది. బబితా ఫోగట్ మాట్లాడుతూ.. వినేష్‌తో ఎలాంటి కుట్ర జరగలేదని తెలిపింది. 2012లో కూడా 200 గ్రాములు అధిక బరువు ఉన్నందున, ఆసియా ఛాంపియన్‌షిప్ కు అర్హత సాధించలేదని తెలిపింది. గతంలో కూడా చాలా మంది ఆటగాళ్లు అధిక బరువు కారణంగా పోటీకి దూరంగా ఉన్నారని తెలిపింది. ఇందులో ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేసింది.

READ MORE: Arshad Nadeem Histroy: చరిత్ర సృష్టించిన పాక్ అథ్లెట్ అర్షద్.. ఒలింపిక్స్ హిస్టరీలోనే..!

వినేష్‌ను రాజ్యసభ అభ్యర్థిని చేస్తానని భూపేంద్ర హుడా చేసిన ప్రకటనపై బబితా ఫోగట్ మాట్లాడుతూ.. “నేను హూడా జీకి ఒకటే అడగాలనుకుంటున్నాను. మీ పదేళ్ల పదవీ కాలంలో ఎంత మంది ఆటగాళ్లను రాజ్యసభకు పంపారు? మీరు ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడాన్ని ఆపాలని.. నేను భూపేంద్ర హుడా, దీపేంద్ర హుడా ఇద్దరినీ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. కుటుంబానికి సంబంధించి రాజకీయాలు చేయవద్దు.” అని ఆమె పేర్కొంది.