NTV Telugu Site icon

Committee Kurrollu: మెగా ఫ్యామిలీ నుంచి నిహారికకు సపోర్ట్ అందట్లేదా..? అసలు విషయం అదేనా..?

Niharika

Niharika

Committee Kurrollu Konidela Niharika: మెగా ఫ్యామిలీ కూతుర్లలో ఒకరైన నిహారిక కొణిదెల, భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోయిన తర్వాత కెరీర్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటిగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ తన సత్తా చాటుతోంది. నిహారిక తాజా చిత్రం కమిటీ కుర్రాళ్లు. యాదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ లు ప్రధాన పాత్రలు పోషించారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 9న విడుదల కానుంది. నిహారిక ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతలు బాగానే చేపట్టింది. పలు చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా కమిటీ కర్రోలు చిత్రాన్ని బాగానే ప్రమోట్ చేసింది. అయితే నిహారిక దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ సపోర్ట్ అండాంట్లు కనపడుతోంది. తన కుటుంబంలో చాలా మంది స్టార్స్ ఉన్నప్పటికీ నిహారిక ఒంటరిగా సినిమాను ఎదుర్కొంటుంది.

Viva Harsha Divorce: విడాకులు తీసుకున్న క‌మెడియ‌న్ హ‌ర్ష.. అసలు నిజం ఇదే..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిహారికను ఈ విషయమై ప్రశ్నించగా.. అందుకు గల కారణాన్ని ఆమె చెప్పుకొచ్చింది. మా నాన్న రాజకీయ కారణాలతో నాన్న మంగళగిరిలో ఉంటున్నారు. నా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయారు. కనీసం ఇంటికి కూడా రావడంలేదు అని నిహారిక చెప్పింది. ఇక పెదనాన్న, అన్న రామచరణ్ పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లారు. అన్న వరుణ్ తన కొత్త సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండడంతో అక్కడ బిజీగా ఉన్నాడు. కాలు విరగడంతో మా వదిన లావణ్య డెహ్రాడూన్‌లో ఉంది. కళ్యాణ్ బాబాయ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చూపాల్సిన పనిలేదని., అందరూ బిజీగా ఉన్నారని.. నా సినిమా రాగానే త‌ప్పించుకున్నారు నిహారిక తెలిపింది. వారంతా కాస్త ఫ్రీ అయ్యాక.. కమిటీ కుర్రోళ్లు సినిమా చూపిస్తానని తెలిపింది. మొత్తానికి బిజీ షెడ్యూల్స్ కారణంగా మెగా కుటుంబ సభ్యులు తన సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నారని నిహారిక స్పష్టం చేసింది.

LB Stadium: నేడు దద్దరిల్లనున్న ఎల్బీ స్టేడియం.. 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం సభ..

Show comments