వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్.. ఎన్బీకె 111 వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే సెట్స్ పైకి టైమ్ లో అనుకోకుండా బ్రేక్ పడింది. ఈ సినిమా మొదట ఒక భారీ స్థాయి చారిత్రక ఎపిక్ గా భారీ బడ్జెట్ తో చేయాలనీ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. కానీ బడ్జెట్ మార్పుల కారణంగా కథలో మార్పు చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీంతో గోపిచంద్ మలినేని మరొక కథ రాసుకున్నాడు.
Also Read : ENE 2 : రూ. 40 కోట్ల భారీ బడ్జెట్ తో థాయిలాండ్ లో టీమ్ కన్యారాసి..
ముంబై బ్యాక్డ్రాప్ లో యాక్షన్ తో పాటు రైతుగా కూడా కనిపించబోతున్నారు బలయ్య. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ నయనతార ఈ సినిమా నుండి వైదొలిగినట్టు వార్తలు వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం అలాంటిది ఏది లేదని గోపీచంద్ మలినేని రాసుకున్న కొత్త కథలోనూ హీరోయిన్ గా నయనతార ఉండనుంది. ఇక సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నాడనే గాసిప్ కూడా మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. బాలయ్య – తమన్ కాంబో రిపీట్ కాబోతుంది అందులో మార్పులేదని తెలిపింది. టీమ్ సన్నిహిత వర్గాలు తెలిపినట్లుగా, స్క్రిప్ట్ ఫైనల్ అయి, ప్రీ‑ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి మార్చి మొదటి వారలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అలాగే ప్రస్తుత కాస్ట్ మరియు క్రూ కూడా ముందు అనుకున్నవారినే తీసుకుంటున్నారు. ఈ సినిమా కథ మారినా, బాలకృష్ణ–నయనతారా కాంబినేషన్‌పై ఫ్యాన్స్ అంచనాలు ఇంకా అధికంగా ఉన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు.
