NTV Telugu Site icon

Waqf Board Amendment Bill: వక్ఫ్ బోర్డులో హిందువులకు కూడా చోటు!..తీవ్రంగా మండిపడ్డ ముస్లిం ఎంపీ

Waqf Board Amendment Bill

Waqf Board Amendment Bill

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో పలు ప్రతిపాదనలపై విపక్షాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వక్ఫ్ బోర్డులో మహిళలు కూడా చేరవచ్చన్నది ఈ ప్రతిపాదనల్లో ఒకటి. ఇది కాకుండా.. ముస్లిమేతరులు కూడా ఇందులో భాగం కాగలరని బిల్లులో ఉంది. దీనిపై లోక్‌సభలో వాడివేడి చర్చ సాగుతోంది.

READ MORE: Himachal Pradesh : హిమాచల్ లో క్లౌడ్ బరస్ట్.. వరదల కారణంగా 13మంది మృతి, 109రోడ్లు బంద్

కాగా..వక్ఫ్ బిల్లుకు కేంద్ర మంత్రి లాలన్ సింగ్ మద్దతు తెలిపారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని లాలన్ సింగ్ తెలిపారు. “ఏదైనా సంస్థ నిరంకుశంగా మారినప్పుడు.. దానిని నియంత్రించడానికి, పారదర్శకత కోసం ప్రభుత్వం చట్టాలను చేస్తుంది. వక్ఫ్ బోర్డులో పారదర్శకత ఉండాలి. పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకువచ్చాం.” అని స్పష్టం చేశారు.

READ MORE: Ganja Gang Arrest: తీగ లాగితే క‌దిలిన డొంక‌.. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

యూపీలోని రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ ఎంపీ మొహిబుల్లా మాట్లాడుతూ.. ఈ బిల్లు ముస్లింలను లక్ష్యంగా చేసుకోబోతోందని అన్నారు. వక్ఫ్ ఆస్తుల బోర్డులో హిందూ సోదరులను చేర్చాల్సిన అవసరం ఏముందన్నారు. హిందువులు, ముస్లింలు లేదా ఏ మతానికి చెందిన వారైనా తమ సంస్థలను నిర్వహించుకునే హక్కు ఉందన్నారు. ఈ బిల్లు తీసుకురావడం ద్వారా మనమే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నామని మండిపడ్డారు. వక్ఫ్‌లో ముస్లిమేతరులను చేర్చే ప్రశ్న తలెత్తితే, అత్యంత పురాతన వక్ఫ్ ఆస్తి కాబా అని మొహిబుల్లా చెప్పారు. ఇదే లాజిక్ అయితే సౌదీ అరేబియాలోని కాబా కమిటీలో హిందువులను కూడా చేర్చుకుంటారా? ఈ బిల్లును నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ప్రజలు తమ హక్కులను కాపాడుకునేందుకు మళ్లీ వీధుల్లోకి రాకూడదని నేను భావిస్తున్నా అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.