Site icon NTV Telugu

Mokila Land Auction: మోకిల భూములకు రెక్కలు.. గజం రేట్ ఎంతంటే.. ..?

Hmda

Hmda

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా అన్నింటికీ మంచి డిమాండ్ వచ్చింది. రెండో దశలో 300 ప్లాట్లను హెచ్ఎండిఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ద్వారా నేటి( బుధవారం ) నుంచి ఐదు రోజుల పాటు ఆన్ లైన్ లో వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నాది.

Read Also: Chandrayaan-3: ల్యాండింగ్ తర్వాత చంద్రుడి తొలి చిత్రాన్ని పంపిన చంద్రయాన్‌-3

ఇవాళ (బుధవారం) మొదటి రోజు ఉదయం 30 ప్లాట్లకు, మధ్యాహ్నం మరో 30 ప్లాట్లకు వేలం ప్రక్రియ జరిగింది. వాటిలో అత్యధికంగా గజం లక్ష రూపాయల చొప్పున మోకిల భూముల రేటు పలకడం విశేషం. మోకిలా లేఅవుట్లో తొలి రోజు గజం రేటు సరాసరిగా రూ.63,513లుగా నమోదు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ ప్రభుత్వానికి చేకూరింది. మోకిలలో హెచ్ఎండిఏ లేఅవుట్.. కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల మంచి డిమాండ్ నెలకొంది.

Read Also: Prakash Raj: చంద్రయాన్ 3 సక్సెస్.. ఈయనకు ఎక్కడో మండుతున్నట్లు ఉంది

అయితే, మోకిల హెచ్ఎండిఏ వెంచర్ ప్లాట్ల వేలానికి అమిత ఆధరణ లభిస్తుంది. మొదటి రోజు ఆన్లైన్ వేలంలో గజం అత్యధికంగా లక్ష రూపాయల ధర పలకడం గమనార్హం. ఈ వేలం ప్రక్రియ మరో ఐదు రోజుల పాటు జరుగున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. ఈ ప్లాట్ల కోసం భారీ మొత్తంలో కొనుగోలు చేసుందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక, హెచ్ఎండీఏ వెంచర్ల వేలానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుండటంతో ప్రభుత్వానికి మరింత రాబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version