NTV Telugu Site icon

IPL 2024: రికార్డ్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17వ సీజ‌న్‌..

Ipl 2024

Ipl 2024

ఐపీఎల్ ప్రస్తుత 17వ సీజన్ కొత్త హిస్టరీ క్రీస్తే చేసింది. ఈ సీజన్‌ లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. ఇంతవరకు ఏసీజన్ లో కూడా ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు సాధించారు. దాంతో ఈసారి సీజన్ లో సెంచరీల సంఖ్యను 14కి పెంచారు. కాగా, నిన్నటి మ్యాచ్‌ లో శుభ్‌మన్ గిల్ చేసిన సెంచరీ ఐపీఎల్‌ లో 100వ సెంచరీ.

Also read: Kothapalli Geetha: జోరుగా కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం..

ఇక ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్ 2 సెంచరీలు సాధించగా., సునీల్ నరైన్ (కేకేఆర్‌), మార్కస్ స్టోయినిస్ (ఎల్‌ఎస్‌జి), విల్ జాక్స్ (ఆర్‌సిబి), రోహిత్ శర్మ (ఎంఐ), విరాట్ కోహ్లీ (ఆర్‌సిబి), సూర్యకుమార్ యాదవ్ (ఎంఐ), ట్రావిస్ హెడ్ (ఎస్‌ఆర్‌హెచ్), జానీ బెయిర్‌స్టో (పిబికెఎస్), రుటోరాజ్ గైక్వాడ్ (సిఎస్‌కె), శుభమన్ గిల్ (జిటి), సాయి సుదర్శన్ (జిటి), యశస్వి జైస్వాల్ (ఆర్‌ఆర్) లు చెరో సెంచరీ చేశారు.

Also read: Navneet Kaur Rana: ఒవైసీ సోదరులకు నవనీత్ కౌర్ మరో వార్నింగ్

ఇక గత ఏడాది 2023 ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 12 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో 10 బ్యాట్స్మెన్స్ కి పైగా సెంచరీలు రావడం ఇదే తొలిసారి. గత సీజన్‌లో తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించారు. ఆరెంజ్ క్యాప్ విజేత గిల్ వరుసగా మూడు సెంచరీలు చేయడం. విరాట్ కోహ్లీ 2 సెంచరీలు చేసారు. గత సీజన్‌ లో సెంచరీలు చేసిన ఇతర బ్యాట్స్‌మెన్‌లు జైస్వాల్ (RR), సూర్యకుమార్ (MI), కామెరాన్ గ్రీన్ (MI), హెన్రిచ్ క్లాసెన్ (SRH), వెంకటేష్ అయ్యర్ (KKR), ప్రబుషిరన్ సింగ్ (PBKS), హ్యారీ బ్రూక్ (SRH)లు ఉన్నారు.