No Airport Countries: ఆ దేశాల్లో విమానాశ్రయాలు లేవు. … అవును ఇది నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Airport Countries: మనిషి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే ఒకప్పుడు ఎండ్ల బండ్లు ఉపయోగించేవారు. తరువాత టాంగా(గుర్రపు బగ్గి) వచ్చింది. ఆ తరువాత బస్సు వచ్చింది. బస్సు తరువాత రైలు.. రైలు తరువాత విమానం వచ్చింది. ప్రస్తుతం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లాలంటే ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ విమానాలే. వాటితోపాటు తక్కువ స్థాయిలో ఓడలను ఉపయోగిస్తున్నారు. ఇక ప్రజా రవాణా కాకుండా వ్యక్తిగత రవాణా విషయంలో సైకిల్ నుంచి హెలికాప్టర్ వరకు టెక్నాలజీతో ఎదగ గలిగాము.. కానీ ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా విమానాశ్రయాలు లేని దేశాలు ఉన్నాయంటే నమ్మవచ్చా.. అంటే నమ్మి తీరాలి. ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో విమానాశ్రయాలు లేవు. ఇది నిజం. విమానాశ్రయాలు లేని దేశాలు యూరప్‌లోనే ఉన్నాయి. అవి ఏంటో .. ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..
Read also: PM Modi: మోడీ క్రేజ్ మామూలుగా లేదుగా.. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం క్యూ కట్టిన యూఎస్ చట్టసభ సభ్యులు
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అన్నట్టుగా ఉన్న విమాన ప్రయాణం ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే విమానాలనే ఆశ్రయిస్తున్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఎంచక్కా ఎయిర్‌పోర్టుకు వెళ్లి విమానాలను ఎక్కేస్తున్నారు.
ఇంతలా విమాన ప్రయాణాలు ప్రాచుర్యం పొందిన ఈ సమయంలోనూ కొన్ని దేశాల్లో ఎయిర్‌పోర్టులు లేవు. నమ్మలేకపోతున్నా ఇది నిజం.
ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం వాటికన్ సిటీ. చుట్టూ నలుదిక్కులా ఇటలీ దేశం వ్యాపించి ఉంటుంది. వాటికన్ సిటీకి.. ప్రత్యేకంగా అధినేత అంటూ ఎవరూ ఉండరు. క్రైస్తవ మత గురువు పోప్ ఆ దేశ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. వెయ్యిలోపు జనాభా ఉండే ఈ వాటికన్ సిటీకి ఎయిర్‌పోర్టు లేదు.
వాటికన్ సిటీకి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరంలో .. రోమ్‌లో ఉన్న సియాంపినో ఎయిర్‌పోర్ట్, ఫిమిసినో ఎయిర్‌పోర్ట్‌లను ఆశ్రయించాలి. అక్కడి నుంచి వాటికన్ సిటీకి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. విమానాశ్రయం లేని మరొక దేశం అండొర్రా. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్యలో ఉన్న చిన్న దేశం అండొర్రా. కొండలు, లోయలు, ప్రకృతి అందాలతో ఇది ఎంతో రమణీయంగా ఉంటుంది. ఇక్కడ 1982లో ఒక ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటైంది. కానీ 1984 నుంచి కమర్షియల్ విమానాలకు ఇక్కడ అనుమతి నిరాకరించారు. దాంతో 2008 వరకు కూడా ప్రైవేటు విమానాలను మాత్రమే అనుమతించారు ఆ తర్వాత ఈ ఎయిర్‌ఫీల్డ్ మూతబడింది. తిరిగి 2010లో రీఓపెన్ అయింది. అండొర్రాకు 2015 నుంచి టూరిస్ట్ చార్టెడ్ ఫ్లైట్స్‌ను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇతరులు వెళ్లాలంటే మాత్రం స్పెయిన్ లేదా ఫ్రాన్స్‌లోని ఎయిర్‌పోర్టులో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అండొర్రాకు వెళ్లాల్సి ఉంటుంది.
Read also:Madhyapradesh : దారుణం.. రైళ్లో మహిళపై అత్యాచారయత్నం.. చివరికి..
ఇటలీని ఆనుకుని ఉత్తరం వైపున ఉన్న శాన్ మారినో దేశంలోనూ విమానాశ్రయం లేదు. ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైన శాన్ మారినోలో దాదాపు 40 వేల మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడికి వెళ్లాలంటే ఇటలీలోని రిమిని లేదా బొలొగ్నా నగరాల్లోని విమానాశ్రయాలకు వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శాన్ మారినోకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ దేశంలో ఎయిర్‌పోర్టు లేనప్పటికీ అత్యవసర వినియోగానికి రెండు హెలీప్యాడ్‌లు మాత్రం ఉన్నాయి. విమానాశ్రయం లేని మరో దేశం మొనాకో. యూరప్‌లోని అతి చిన్న దేశాల్లో మొనాకో ఒకటి. ఈ దేశానికి మూడు దిక్కుల ఫ్రాన్స్ దేశమే ఉంటుంది. ఒక వైపు మాత్రం మధ్యధరా సముద్రం ఉంటుంది. దాదాపు 40 వేల మంది జనాభా ఉండే ఈ దేశానికి ఇప్పటివరకు ఎయిర్‌పోర్ట్ లేదు.మొనాకోకు సమీపంలో ఫ్రాన్స్‌లోని నైస్ కొట్ డిఅజుర్ ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. ఇక్కడి నుంచి 30 నిమిషాల్లో మొనాకోకు చేరుకోవచ్చు. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల మధ్యలో ఉన్న అతి చిన్నదేశం లిచెన్‌స్టైన్. పర్యాటక ప్రాంతంగా ఫేమస్ అయిన ఇక్కడ కనీసం ఒక్క ఎయిర్‌పోర్టు కూడా లేదు. ఇక్కడికి వెళ్లాలంటే పొరుగు దేశాలైన స్విట్జర్లాండ్, ఆస్ట్రియా ఎయిర్‌పోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుంది. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ గాలెన్, ఆల్టెన్రిన్ ఎయిర్‌పోర్టులో దిగి.. రోడ్డు మార్గంలో లేదా పడవల ద్వారా లిచెన్‌స్టైన్ చేరుకోవచ్చు. లేదా ఆస్ట్రియా నుంచి రైలులో కూడా లిచెన్‌స్టైన్‌కు రావచ్చు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!