NTV Telugu Site icon

Srikrishna: శ్రీకృష్ణుణ్ని పెళ్లాడిన యువతి.. వివాహ ప్రమాణ పత్రం కూడా..

5

5

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ లో యువతి తాను చిన్నప్పుడు నుంచి ఎంతో ఆరాధన భావంతో కొలిచిన శ్రీకృష్ణ పరమాత్మని పెళ్లి చేసుకుంది. తన బంధుమిత్రుల అందరి సమక్షంలోనే ఈ వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్వాలియర్ నగరంలోని న్యూ బ్రజ్‌ విహార్‌ కాలనీ నివాసముంటున్న శివాని పరిహారకు చిన్నటిప్రాయం నుండి భగవాన్ శ్రీ కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ, భక్తి భావం.

Also Read: Ram Mandir : అయోధ్య రామమందిరంలో నేటి నుంచి వీఐపీ దర్శనాలు షురూ

అలా వయసు పెరిగే కొద్ది శ్రీకృష్ణ పరమాత్మపై మరింత ప్రేమ పెరగడంతో చివరికి శ్రీకృష్ణుని పెళ్లి చేసుకోవాలని తాను నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆవిడ వారి తల్లిదండ్రులను ఒప్పించి శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహంతో పెళ్లి చేసుకుంది. కుటుంబ ఆచారాల వ్యవహారాలను అనుసరించి వధువుకు అప్పగింతల కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ వివాహ కార్యక్రమంలో భాగంగా వరుడు శ్రీకృష్ణుని విగ్రహాన్ని బృందావన్ నుంచి బ్యాండ్ మేళాలతో పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా తరలించారు.

Also Read: Indravelli: ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు ఆదివాసీలు

స్థానిక గుడిలో వేదమంత్రాలు సాక్షిగా ఈ వివాహం అందంగా వైభవంగా జరిగింది. ఇక వివాహం ముగిసిన తర్వాత శివానికి వివాహ ప్రమాణం పత్రం కూడా అధికారులు అందజేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి విగ్రహం శివాని బృందావనానికి బయలుదేరగా తన పూర్తి జీవితాన్ని బృందావనంలోని రాధా ధ్యాన్ ఆశ్రమంలో ఆయనకు సేవలు చేస్తూ ఉండనున్నట్లు తెలిపింది. ఇక శివాని తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కుమార్తె పెళ్లి విషయంలో తాము మొదట సంశయించామని కాకపోతే ఆమె పట్టుదల చూసి చివరికి అంగీకరించినట్లు తెలిపారు.