NTV Telugu Site icon

Stree 2: ‘స్త్రీ 2’లో గెస్ట్ రోల్ చేయనున్న ఆ యంగ్ హీరో..?

Whatsapp Image 2024 02 11 At 11.58.02 Pm

Whatsapp Image 2024 02 11 At 11.58.02 Pm

ప్రస్తుతం ఇండియన్ మూవీస్ లో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ మొదలయింది.ముందుగా ఈ సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ఈ హాలీవుడ్లో మొదలయ్యాయి.ఇప్పుడు ఇండియన్ మూవీస్ కూడా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి వీటిని ప్రారంభించాయి. హాలీవుడ్లో హారర్ సినిమా యూనివర్స్ చాలా ఫేమస్. అదే విధంగా బాలీవుడ్లో చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు నిర్మాత దినేష్ విజన్. ఇప్పటికే ‘స్త్రీ’ అనే హారర్ కామెడీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. ఇప్పుడు దీనికి సీక్వెల్ ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సీక్వెల్ లో ఓ యంగ్ హీరో నటిస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.2018లో దినేష్ విజన్ నిర్మాణంలో తెరకెక్కిన ‘స్త్రీ’ మూవీ ఏ హడావిడి లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాలీవుడ్లో ఎంతోకాలంగా ఎవరూ టచ్ చేయని హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన  మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.దీంతో నిర్మాత దినేష్ తాను ఒక హారర్ కామెడీ యూనివర్స్ క్రియేట్ చేస్తానని ప్రకటించాడు.

అందుకే అదే యూనివర్స్ లో ‘రూహీ’, ‘భేడియా’ చిత్రాలను తెరకెక్కించాడు. ఇప్పుడు ‘స్త్రీ’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘స్త్రీ 2’లో అన్ని క్యారెక్టర్స్ ని కలిపే ప్రయత్నాలు మొదలుపెట్టాడట ప్రొడ్యూసర్ దినేష్ విజన్.‘భేడియా’లో ఒక వింత జీవి ఆకారంలో యంగ్ హీరో వరుణ్ ధావన్ కనిపించాడు. ఇప్పుడు ‘స్త్రీ 2’లో కూడా మరోసారి అదే పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం కోసం వరుణ్ ధావన్ 2 రోజుల కాల్ షీట్స్ ను నిర్మాత దినేష్ కి అందించినట్లు సమాచారం.ఇక ‘స్త్రీ 2’లో గెస్ట్ రోల్ చేయడం వల్ల ‘భేడియా’ చిత్రానికి సీక్వెల్ కథ ముడిపడి ఉంటుందని బాలీవుడ్ లో రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో వరుణ్ పాత్ర కనిపించేది కాసేపే అయినా.. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందట. అంతే కాకుండా దీని ద్వారా ‘భేడియా 2’కు కూడా సన్నాహాలు మొదలయ్యాయని సమాచారం.