నేడు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఈ బస్సు యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నారు. జగన్ సర్కార్ చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి వైసీపీ నాయకులు తీసుకెళ్తున్నారు. ఇక, నేడు ప్రకాశం జిల్లా కనిగిరిలో సామాజిక సాధికారిక యాత్ర కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ వై విజయసాయి రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్థసారథి పాల్గొననున్నారు. ఇక, ఇవాళ పాలకొల్లులో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. పాలకొల్లులో నిర్వహించనున్న బహిరంగ సభకు మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, విడదల రజనీ హాజరుకానున్నారు. అలాగే, సాలూరు నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు.
Samajika Sadhikara Bus Yatra: నేడు 11వ రోజుకు చేరిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర

Bus Yatra