NTV Telugu Site icon

PM-AASHA : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పథకానికి రూ. 35,000 కోట్లు కేటాయింపు

Pm Aasha

Pm Aasha

ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పీఎం-ఆశా పథకం కోసం రూ. 35,000 కోట్లను ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రైతు సోదర సోదరీమణులకు సరసమైన ధరలకు ఎరువులు నిరంతరం సరఫరా చేసేందుకు, 2024 రబీ సీజన్‌కు పోషకాల ఆధారిత సబ్సిడీ ధరలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా రైతులకు సాగు ఖర్చు కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నిర్ణయంతో పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలకు కనీస ధర లభించనుంది. ఇలాంటి పంటల సాగులో భారతదేశం స్వావలంబన సాధిస్తుంది. రైతులు సంతోషంగా ఉంటారు.. వారి ఆదాయం పెరుగుతుందని మోడీ తెలిపారు.

READ MORE: Bhadradri : భద్రాద్రి దేవాలయం పేరును ఉపయోగించి అమెరికాలో విరాళాలు

ఇదిలా ఉండగా.. కేంద్రం కేబినెట్ సమావేశంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర మంత్రివర్గం ఈరోజు భేటీ అయింది. ఈ సమావేశంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాగా.. ఈ బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచింది. ఈ క్రమంలో కేంద్రం ఆమోదం తెలిపింది.

Show comments