Site icon NTV Telugu

Article 370 : ఆసక్తికరంగా సాగిన ‘ఆర్టికల్ 370’ ట్రైలర్..

Whatsapp Image 2024 02 08 At 10.55.57 Pm

Whatsapp Image 2024 02 08 At 10.55.57 Pm

బాలీవుడ్ నటి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్టికల్ 370’. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత ప్రధాన అంశంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.ఆదిత్య సుహాస్ జంబాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఆర్టికల్ 370 చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో నేడు (ఫిబ్రవరి 8) ట్రైలర్ రిలీజ్ అయింది.ఆర్టికల్ 370 చిత్రంలో యామీ గౌతమ్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌ పాత్ర పోషించారు. కశ్మీర్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఘర్షణలు మరియు అవినీతిపై ఆమె పోరాడుతుంటారు. జము కశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్ 370 ప్రత్యేక స్టేటస్ వల్ల ఆమె విధులకు ఆటంకం ఏర్పడుతుంటుంది. ఘర్షణలను అరికట్టేందుకు కూడా ఈ అధికరణ ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఆర్టికల్ 370 అధికరణను ప్రభుత్వం ఎత్తేయాలని నిర్ణయించే క్రమంలో జరిగిన ప్రక్రియను కూడా ట్రైలర్లో మేకర్స్ చూపించారు.

కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం, ఆ తర్వాత పరిణామాలు కూడా ట్రైలర్లో చూపించారు.. “మొత్తం కశ్మీర్.. భారత దేశంలో అంతర్భాగమే.. ఎప్పటికీ అలాగే ఉంటుంది” అనే డైలాగ్‍తో ట్రైలర్ ముగిసింది. 2 నిమిషాల 43 సెకన్లు ఉన్న ఆర్టికల్ 370 ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‍గా సాగింది.ఆర్టికల్ 370 చిత్రంలో ప్రియమణి, వైభవ్, తత్వవాది, అరుమ్ గోవిల్, రాజ్ అరుణ్, స్కంద ఠాకూర్, అశ్విన్ కౌల్, కిరణ్ కర్మాకర్, దివ్య సేత్ షా, రాజ్ జుత్షి, సుమిత్ కౌల్, గోపినాథ్ మరియు అశ్విని కుమార్ కీలపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఆదిత్య ధార్ మరియు లోకేశ్ ధార్ నిర్మించగా శష్వాంత్ సచ్‍దేవ్ సంగీతం అందించారు. ట్రైలర్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రానుంది.భారత దేశ చరిత్రలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని ఈ చిత్రంలో తాము చూపించామని దర్శకుడు ఆదిత్య సుహాస్ చెప్పారు. రాజకీయ అంశంతో పాటు యాక్షన్ కూడా ఈ చిత్రంలో ఉంటుందని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఆయన తెలిపారు.

Exit mobile version