Uttar Pradesh: సైకిల్‌పై వస్తుండగా విద్యార్థిని చున్నీ లాగిన నిందితులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అగంతకులు చేసిన వేధింపులకు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిని వేధించిన నిందితులంతా ఫలానా వర్గానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన హన్స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హీరాపూర్లోని రామ్‌జీ ఇంటర్ కాలేజీ నుంచి విద్యార్థిని సైకిల్ పై ఇంటికి వస్తుండగా.. వెనుక నుంచి ఇద్దరు అగంతకులు బైకుపై వచ్చి చున్నీ లాగారు. దీంతో విద్యార్థి అదుపు తప్పి కింద పడిపోయింది. వెంటనే వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్రవాహనం విద్యార్థి తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
King of Kotha : ఓటీటీ లోకి రాబోతున్న యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు యువకులు ప్రత్యేక వర్గానికి చెందినవారు కాగా.. మొదట్లో పోలీసులు చర్యలు తీసుకోవడంలో వెనుకాడారు. అయితే ఆ తర్వాత సీసీటీవీ వీడియో బయటికిరావడంతో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారని చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంతకుముందు కూడా తమ కూతురిని ఫలానా వర్గానికి చెందిన యువకులు వేధించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిపినా.. పట్టించుకోలేదని తెలిపారు.
Nara Brahmani: చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నేరమా..?
మరోవైపు ఈ ప్రాంతంలో తరచూ అగంతకులు రోడ్లపై తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులను ఎగతాళి చేస్తుంటారని తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు షాబాజ్, అర్బాజ్, ఫైసల్లపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు హస్వార్ పోలీస్ స్టేషన్ ప్రెసిడెంట్ రితేష్ పాండే తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!