Site icon NTV Telugu

CM Revanth: సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు గుడ్ న్యూస్..

Revanth

Revanth

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా TSRTC 100 బస్సులను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన బస్సులను మేడారంకు కూడా నడపనున్నుట్లు ఆయన చెప్పారు. మరోవైపు.. పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరో 1000 బస్సులు కొంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టాలని మేనిఫెస్టోలో పెట్టాం.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పథకం అమలు చేశామన్నారు. 15 కోట్ల 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారని సీఎం తెలిపారు.

Weight Loss Tips : బరువు పెరుగుతున్నారా? అయితే ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి..

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర ఎవరు మర్చిపోరని.. ఉద్యమంలో కార్మికులు సైతం ముందుండి నడిపించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు మీ ఆధ్వర్యంలో కొత్త బస్సులు ప్రారంభించుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విస్మరించిందని పేర్కొన్నారు. ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణ త్యాగం చేశారు.. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన అంకెలతో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టిందని సీఎం తెలిపారు. ఈసారి రవాణా శాఖకి బడ్జెట్ లో వాస్తవిక అవసరాల మేరకు బడ్జెట్ తగ్గినా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు.

TSRTC: కొత్తగా 100 బస్సులు ప్రారంభం..

ప్రతినెలా ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3 వందల కోట్లు చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పథకం ఆర్టీసీని బలోపేతం అవ్వడానికి ఉపయోగపడుతుందని అన్నారు. దుబారా ఖర్చులు తగ్గించుకుని అయినా సరే.. రాష్ట్ర అవసరాలకు తమ ఖజానాని వాడుతారని పేర్కొన్నారు. ఆర్టీసీ సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మంచి పరిపాలన అందిస్తే తెలంగాణ మోడల్ను ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Exit mobile version