Bandhi Movie Teaser Release: అడవిలో హీరో ఆదిత్య ఓం ‘బంధీ’.. ఎలా బయటపడ్డాడో చూడండి
- తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్న మొదటి చిత్రం.. ‘బంధీ’
- ‘బంధీ’ టీజర్ విడుదల
- కార్పొరేట్ వల్ల నాశనమౌతున్న ప్రకృతిని కాపాడటమే హీరో లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్న మొదటి చిత్రం.. ‘బంధీ’ టీజర్ విడుదలైంది. ప్రత్యేక కంటెంట్ చిత్రాలను చేస్తూ.. వస్తున్న ఆదిత్య ఓం ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తున్నారు. తిరుమల రఘు దర్శకత్వం వహించారు. నేడు ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో.. దర్శక నిర్మాత రఘు తిరుమల తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇది తకు మొదటి చిత్రమని తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు. ఆదిత్య ఓం సపోర్ట్ వల్లే ఈ మూవీని చేయగలిగాని హీరోను కొనియాడారు. ఆదిత్య ఓం ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. సినిమాలో కేవలం ఒక్క కారెక్టరే ఉంటుందని.. ఆదిత్య వర్మ అనే పాత్రతోనే ఈ మూవీ ఉంటుందని స్పష్టం చేశారు.
READ MORE: Sangareddy: కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి బాలికపై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పోరేట్ కంపెనీలకు సపోర్ట్ చేసే పాత్రలో ఆదిత్య కనిపిస్తారని వెల్లడించారు. అలాంటి లీగల్ అడ్వైజర్ పాత్రని అడవిలో వదిలేస్తే ఏం జరుగుతుంది? అనేది చాలా ఆసక్తి కరంగా ఉంటుందని.. ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని ఆశించారు. ప్రకృతిని ఎలా కాపాడుతాడు? అనే అంశంపై కథ ఉంటుందని తెలిపారు. కరోనా మహమ్మరి అనంతరం ప్రకృతి మీద అందరికీ అవగాహన ఏర్పడిందని.. అందుకే ఈ కథను రాసినట్లు చెప్పుకొచ్చారు. ఆదిత్య ఓం గురించి మాట్లాడుతూ.. అతడు ఎంతో ఒదిగి ఉండేవారని.. టీంతో ఎంతో బాగా మెలిగేవారని గుర్తుచేసుకున్నారు. మూడేళ్లలో ఆయన్ను చాలా దగ్గర్నుంచి గమనించినట్లు చెప్పారు. ఆరేడు నెలల క్రితమే షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నారు. ఆదిత్య సినిమాలో ఎక్కడా కూడా డూప్ వాడనివ్వలేదన్నారు. సొంతంగా యాక్షన్ సీక్వెన్స్ చేశారన్నారు. “ఆయన ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్నారు. పంచభూతాలతో అడవిలో మమేకమై ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోతో భిన్నమనస్తత్వాలు కూడిన మనుషులతో కలిసి ఉన్నాడు. సక్సెస్ అయి వస్తాడని ఆశిస్తున్నాను” అని దర్శక నిర్మాత రఘు తిరుమల పేర్కొన్నారు.
READ MORE: SC Sub Plan: ఎస్సీ సబ్ ప్లాన్ తీర్పుపై కమిటీ ఏర్పాటు..
ఈ కార్యక్రమానికి హాజరైన నరకాసుర నిర్మాత కారుమూరు తన మాట్లాడారు. రఘు ఈ చిత్రాన్ని బాగా తీశారని కొనియాడారు. సినిమాకి ఏం కావాలో అది చేశారన్నారు. ఆదిత్యను ఇరవై ఏళ్ల క్రితం కలిశానని.. ఆయన నన్ను ఇన్నేళ్లుగా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. సినిమాకు ఎంతో కొంత మంచి జరుగుతుందని అనుకున్నారని.. మనందరి కోసమే బిగ్ బాస్ షోకి వెళ్లారని చెప్పుకొచ్చారు. ఆయన వల్లే తనకు ఈ సినిమా అవకాశం వచ్చిందని స్పష్టం చేశారు. యూఎస్ డిస్ట్రిబ్యూటర్, వీఎఫ్ఎక్స్ హెడ్ జాకబ్ ప్రసంగించారు. రఘు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను తీశారని.. ఆదిత్య ఓం నటించిన లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐలవ్యూ ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించాయని గుర్తుచేశారు. యూఎస్‌లో డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!