Site icon NTV Telugu

Crime: భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో దారుణ హత్య

Crime

Crime

బెంగళూరులో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. మృతుడు విమానాశ్రయంలో ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రామకృష్ణగా గుర్తించారు. అక్రమ సంబంధాల వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీంతో పాటు నిందితుడు రమేష్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

READ MORE: Mamata banerjee: ఎఫ్‌ఐఆర్ బుక్‌ అయితే ఇరుక్కుంటారు.. జూడాలకు మమత వార్నింగ్

ఈ ఘటనతో అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. నిందితుడు రమేష్‌ బ్యాగ్‌లో పదునైన ఆయుధాన్ని తీసుకుని వచ్చినట్లు నార్త్‌ఈస్ట్‌ డీసీపీ తెలిపారు. బీఎంటీసీ బస్సులో ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. బస్సులో ఉన్నందున బ్యాగ్‌ను స్కాన్ చేయలేదు. అవకాశం చూసి.. అతను రామకృష్ణపై కిరాతకంగా దాడి చేసి, టెర్మినల్ 1 (లేన్ 1)లోని అరైడ్స్ పార్కింగ్ ప్రాంతంలోని టాయిలెట్ దగ్గర చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

READ MORE: Maharashtra: ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో శిల్పిపై హత్యాయత్నం కేసు

కాగా.. గత నెలలో కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ హత్య కేసు వెలుగు చూసింది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్నేహితుడిని హత్య చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేవాడు. తెలిసిన వ్యక్తి అతని ఇంట్లోనే ఓ యువకుడని దారుణంగా చంపి, శరీరభాగాల్ని ముక్కలుగా నరికేసి ఆ శరీర భాగాలను సంచిలో నింపి కల్వర్టులో పడేశాడు. మృత దేహం కోసం చాలా రోజులుగా అగ్నిమాపక సిబ్బంది, సంబంధిత నిపుణులు వెతికినా ఇంత వరకు ఆచూకీ లభించలేదు. ఈ ఘటన బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.హత్యకు గురైన వ్యక్తిని కేవీ శ్రీనాథ్ (34)గా గుర్తించారు. మాధవరావు అనే వ్యక్తి అతని స్నేహితుడు శ్రీనాథ్ ను హత్య చేశాడని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

Exit mobile version