NTV Telugu Site icon

The Rising Sun In AP : ఏపీలో మండిపోతున్న ఎండలు

Sun Rise

Sun Rise

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గతం వారం రోజులుగా ప్రతిరోజు ఎండ తీవ్రత పెరుగుతుంది. వారం రోజుల వ్యవధిలో 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత చేరుకుంది. బెజవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, విశాఖలో విపరీతంగా వేడిమి పెరుగుతున్నాది. వడగాలుల తాకిడితో ఏపీలోని 100కి పైగా మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ దెబ్బకి 12 గంటల లోపే నగర వాసులు ఇళ్లకు చేరుతున్నారు. దీంతో నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి మరింతగా ఎండ తీవ్రత పెరగనున్నది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే ముందు తగిన జాగ్రత్త చర్యలతో బయటకు రావాలని IMD సూచించింది.

Read Also : Sunil Gavaskar: ధోని లాంటి కెప్టెన్ లేడు.. ఇక ముందు రాలేడు..

ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే చాలా మంది భయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మండలాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు ఏపీ వాతావరణశాఖ తెలిపింది. తాజాగా భారత వాతావరణ కేద్రం ఏపీ ప్రజలను అలర్ట్ చేసింది. రాష్ట్రంలో చాలా మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7, అనకాపల్లిలో 13, తూర్పుగోదావరిలో 10, ఏలూరులో 1, గుంటూరులో 6, కాకినాడలో 16, కోనసీమలో 6, కృష్ణాజిల్లాలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 6, పార్వతీపురంమన్యంలో 7, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 3, విజయనగరంలో 24 మండలాల్లో వడగాల్పులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అనకాపల్లిలో 10, కాకినాడలో 2, ఎన్టీఆర్ లో 2 మండలంలో తీవ్రమైన వడగాల్పులు నమోదవుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.

Read Also : Amit Shah Hyderabad Tour: అమిత్ షా హైదరాబాద్ టూర్.. భారీ సభకు ఏర్పాట్లు