Site icon NTV Telugu

UP: క్లాస్‌లో పోర్న్ చూసిన విద్యార్థులు..అడ్డుకున్న ప్రిన్సిపల్ ను చితకబాదిన వైనం

Class

Class

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ ఇంటర్‌ కాలేజీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి.. కొంతమంది విద్యార్థులు తరగతి గదిలో మొబైల్‌లో పోర్న్ చూస్తున్నారు. దీంతో ప్రిన్సిపల్‌ మందలించారు. సెలవుల అనంతరం కొందరు విద్యార్థులు దారిలో చుట్టుముట్టి ప్రిన్సిపల్‌ ను చితక బాది.. డబ్బులు కూడా లాక్కెళ్లారు. బఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంత్ త్రివేణి పర్వత్ ఇంటర్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

READ MORE: LV Subramanyam: విరాళాల సేకరణపైనే కాకుండా.. భక్తులకు మెరుగైన సేవలపై దృష్టి పెట్టండి..

అసలేం జరిగిందంటే.. కాలేజీలో ఏడో పీరియడ్‌ సమయంలో క్లాస్‌లోని కొందరు విద్యార్థులు ఇతర బాలికలతో కలిసి ఓ గదిలో కూర్చుని మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ విద్యార్థులను మందలించి.. మొబైల్ లాక్కోవడంతో పాటు ఎనిమిదో పీరియడ్‌లో మళ్లీ అలా చేయవద్దని సూచించారు. మొబైల్‌ను తిరిగి ఇచ్చేశారు. అయితే క్లాస్‌ ముగించుకుని ప్రిన్సిపాల్‌ బైక్‌పై ఇంటికి వస్తుండగా ఓ విద్యార్థి తన స్నేహితులతో కలిసి చుట్టుముట్టి కొట్టాడు. అంతే కాదు ఆ విద్యార్థి తనను తుపాకీతో బెదిరించి జేబులోంచి రూ.2200 తీసుకున్నాడని ప్రిన్సిపాల్ ఆరోపించారు. గట్టిగా అరవడంతో స్థానికులు వస్తారని బయపడి నిందితులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు.

READ MORE: OTT : మరొక ఓటీటీలో విడుదల కానున్న సత్యభామ..ఎక్కడంటే..?

ప్రిన్సిపాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..
ఈ కేసులో నిందితుడైన విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ శశి శేఖర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై బాఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రాజేష్ పాండే మాట్లాడుతూ.. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతున్నామన్నారు. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

READ MORE:IND vs SL: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. మూడో టీ20 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!

కాగా..ఈ ఇంటర్ కాలేజ్ బీహార్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. కళాశాల నుంచి బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా దూరం కేవలం ఒక కిలోమీటరు మాత్రమే. బీహార్ నుంచి 40 శాతం మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకుంటారు. ఈ కళాశాలలో మొత్తం 2800 మంది విద్యార్థులు ఉన్నారు.

Exit mobile version