యూపీలో విషాదం చోటు చేసుకుంది. ఫరూఖాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నీళ్లు తాగేందుకు వెళ్లిన విద్యార్థి.. ట్యాప్ విప్పగానే ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. చిన్నారి నేలపై పడి ఉండడం గమనించిన పాఠశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు చిన్నారిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే.. విద్యార్థి చేతిలో బెలూన్ ఉందని, బహుశా ఆ బెలూన్ అతని గొంతులో ఇరుక్కుపోవడం వల్ల ఊపిరి పీల్చుకోవడానికి రాలేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు.
Read Also: AP CM Chandrababu: ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష
బహోరాలో నివాసం ఉంటున్న ఏడేళ్ల విద్యార్థి జాగర్ సింగ్.. బహోరా ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థి నీళ్లు తాగేందుకు ఒక్కసారిగా పరిగెత్తాడు. విద్యార్థి కుళాయి విప్పిన వెంటనే.. ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. విద్యార్థి నేలపై పడిపోవడంతో పాఠశాల సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని లేపేందుకు ప్రయత్నించినప్పటికీ అతను లేవలేదు. దీంతో.. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లి సీమాదేవి, తండ్రి జబర్ సింగ్ హడావుడిగా పాఠశాలకు చేరుకున్నారు.
Read Also: Rishabh Pant-Shubman Gill: పంత్ బౌలింగ్.. గిల్‌కు ముచ్చెమటలు (వీడియో)
వారు వెంటనే తమ కుమారుడిని 108 అంబులెన్స్‌లో కమల్‌గంజ్ సిహెచ్‌సికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు చనిపోయినట్లు ప్రకటించారు. కొడుకు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా.. కొంతమంది విద్యార్థులు జాగర్ సింగ్ నోటిలో బెలూన్ కనిపించిందని చెప్పారు. బెలూన్ గొంతులో ఇరుక్కుపోవడంతో విద్యార్థి నీరు తాగేందుకు పరుగులు తీయగా, ఊపిరాడక చనిపోయాడు. పాఠశాలలో విద్యార్థి మృతి వార్త తెలియగానే ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్, సబ్ కలెక్టర్ సదరు రజనీకాంత్ ఆస్పత్రికి చేరుకుని విషయంపై ఆరా తీశారు. మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.