సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.. ఇటీవల జైలర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న తలైవా, ఆ వెంటనే లాల్ సలామ్ సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్నారు.రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టైయాన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా మరియు రితికా సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈ మూవీ తరువాత తలైవా తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘కళుగు’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
అయితే తాజాగా ఈ నెల 22వ తేదీన చిత్ర టైటిల్‌ను మరియు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెలిపారు.అలాగే ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందనీ ఆయన అన్నారు..తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఈ మూవీలో రజినీకాంత్ కూతురిగా శృతిహాసన్ నటించనున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో దిగ్గజ నటుడు కమల్ హాసన్ కూతురు ఇప్పుడు రజినీకాంత్ కు కూతురుగా నటించనుండటం విశేషం అని చెప్పాలి.దాదాపు మూడేళ్ల తరువాత శృతి హాసన్ కు కోలీవుడ్ లో నటించే అవకాశం దక్కింది.రీసెంట్ గా శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ రాసి, రూపొందించిన ఇనిమేల్ అనే పాట ఆల్బమ్‌లో దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కలిసి నటించింది.ఇప్పుడు అదే లోకేష్ దర్శకత్వంలో రజనీకాంత్ కు కూతురుగా నటించనుంది. అయితే ఈ వార్త పై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు..
