Site icon NTV Telugu

Family Dispute : తాగి వచ్చి తల్లిని కొడుతున్నాడని తండ్రికి ఊహించని షాక్ ఇచ్చిన కొడుకు

New Project (16)

New Project (16)

Family Dispute : రోజూ మద్యం తాగి వచ్చి తల్లిని కొట్టడంతోపాటు మానసికంగా హింసించేవాడు. దీంతో తండ్రి పెట్టే బాధలను భరించలేని కొడుకు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో వెలుగు చూసింది. తండ్రి తాగి వచ్చి తల్లికొడుకులను పట్టించుకునేవాడు కాదు. అందుకే తండ్రి వేధింపుల నుంచి తల్లిని కాపాడేందుకు కొడుకు తండ్రిని చంపేశాడు. ఈ ఘటన అంబర్‌నాథ్‌లోని బువాపాడ ప్రాంతంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి పేరు రాజేష్ వర్మ. ఈ ఘటనపై అంబర్‌నాథ్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. నిందితుడైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: The Oscar goes to….: ఆ బాతు పెర్ఫార్మెన్స్ కి ఆస్కార్ ఇవ్వాల్పిందే!

రాజేష్ వర్మ తన భార్య అనిత, 19 ఏళ్ల కుమారుడు ప్రకాష్‌తో కలిసి అంబర్‌నాథ్ వెస్ట్‌లోని బువాపాడా ప్రాంతంలో నివసించాడు. రాజేష్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. రాజేష్ తన భార్య అనితను ప్రతీరోజు కొట్టేవాడు. ఈ విషయంపై ప్రకాష్‌ తన తండ్రి అయిన రాజేష్‌తో గొడవపడేవాడు. ఆదివారం కూడా యథావిధిగా మద్యం తాగి ఇంటికి వచ్చిన రాజేష్ భార్య అనితను కొడుతున్నాడు. ఈ సమయంలో కుమారుడు ప్రకాష్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినలేదు. భార్యను తీవ్రంగా కొట్టాడు. చివరకు కోపోద్రిక్తుడైన ప్రకాష్ ఇంట్లో నుంచి కత్తి తీసుకుని రాజేష్ ఛాతిపై పొడిచాడు. ఈ ఘటనలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Read Also: YS Sharmila: పోలీసులతో వైఎస్‌ షర్మిల దురుసు ప్రవర్తన.. వీడియో ఇదిగో..

ఘటనపై సమాచారం అందుకున్న అంబర్‌నాథ్ వెస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉల్లాస్‌నగర్‌ సెంట్రల్‌ ఆస్పత్రికి తరలించారు. భార్య అనితా వర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు అతని కుమారుడు ప్రకాష్ వర్మపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Exit mobile version