NTV Telugu Site icon

Snake: భానుడి ప్రతాపం.. నీటి తొట్టిలో నాగుపాము జలకాలాట..

Snake

Snake

Snake: ఎండలు మండిపోతున్నాయి.. ఇంటి నుంచి బయటకు అడుగు బయటపెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. మనుషులే కాదు.. మూగజీవాలు, జంతువులు, పక్షులు, పాములు కూడా అల్లాడి పోతున్నాయి.. ఎండ వేడి తట్టుకోలేక.. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నాయి.. వాతావరణ శాఖ అధికారులు కూడా అత్యవసరం అయితేనే బయటకు రండి.. వడగాలులు, వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.. ఓ నాగు పాము ఎండకు అల్లాడిపోయింది.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ నాగుపాము ఎండవేడికి తట్టుకోలేక.. నీటి తొట్టిలో చేరింది.. నీటి కోసం తొట్టి దగ్గరకు వెళ్లిన ఇంటి యజమాని అది చూసి షాక్‌ తిన్నాడు.. ఆ తర్వత తేరుకుని నీటి ఆ పామును తన సెల్‌ఫోన్‌లో బంధించాడు.. ఇక, ఆ తర్వాత కట్టెతో ఆ తొట్టి నుంచి నాగుపామును బయటకు తీశారు.. ఆ తర్వాత ఆ పామును ఏం చేశారు అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది..

Read Also: Five AP villages appealed to Governor: ఏపీతో ఇబ్బంది పడుతున్నాం.. తెలంగాణలో కలిపేయండి..

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో ప్రకారం.. సిమెంటు తొట్టిలో ఉన్న నాగుపామును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కొనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోఎండ వేడిమి తట్టుకోలేక నీటి తొట్టిలో ప్రత్యక్ష మైన నాగు పాము ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.. శ్రీరాముల బాబు అనే వ్యక్తి ఇంటి పరసరాల్లో ఉన్న నీటి తొట్టిలో ప్రత్యక్షమైన నాగుపామును చూసి మొదట ఆందోళనకు గురైనా.. ఆ తర్వాత.. ఆ పామును బయటకు పంపించినట్టుగా తెలుస్తోంది.